అర్జున్ రెడ్డి లో ఆ హీరోయిన్ సాడ్ స్టొరీ… సినిమాలకు ఎందుకు దూరమైంది…?

Movie News

టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే వాటి రేంజ్ వేరు… అందులో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి. సినిమా విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే సినిమాను సినిమా మాదిరిగా చూసిన వాళ్లకు ఆ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అసభ్యం అంటూ అమ్మమ్మ మాటలు చెప్పే వాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది. దుప్పటి ముసుగు వేసుకుని ఫోన్ హిస్టరీ డిలీట్ చేసే వాళ్ళు చాలా మంది ఆ సినిమా అసభ్యంగా ఉందన్నారు.

ఇక ఆ సినిమాలో నటించిన చాలా మందికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అందులో జియా శర్మ అనే మోడల్ కి మాత్రం ఛాన్స్ లు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటీ అనేది తెలియదు గాని జియా మాత్రం తాజాగా కొన్ని విషయాలు చెప్పింది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ప్రమోషన్స్ లో గాని సక్సెస్ మీట్ లో గాని పాల్గొనే పరిస్థితిలో లేను అని చెప్పింది.

తన తల్లికి క్యాన్సర్ ఉందని తన తండ్రి కూడా లేకపోవడంతో తానే అన్నీ చూసుకున్నా అని చెప్పింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత తన తల్లి క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలు కోల్పోయారని ఆమె చెప్పింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఎదురీత అనే సినిమాలో ఆమె నటించింది. 2021లో క్షణక్షణం అనే తెలుగు థ్రిల్లర్ సినిమాతో మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది గాని ఆమెకు అనుకున్న విధంగా హిట్ రాలేదు. ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి, హీరో విజయ్, నటుడు రాహుల్ రామకృష్ణ అందరూ బాగా సక్సెస్ అయ్యారు.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

Leave a Reply

Your email address will not be published.