ఈ వయసులో పెళ్లి చేసుకున్నవారు అధిక ప్రయోజనాలు పొందుతారు..

Trending

మానవుని జీవితంలో పెళ్లి చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక అవసరాలకు కొందరిని మినహాయించితే మిగతావారందరు పెళ్లి చేసుకుంటేనే జీవితాన్ని హాయిగా గడుపుతారనని పలు అధ్యాయనాలు తెలుపుతున్నాయి.

అయితే ‘ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చెయ్యాలి’ అన్నట్లుగా సరైన ఏజ్ లో వివాహం చేసుకుంటనే అన్నిరకాలుగా ఉపయోగం ఉంటుందని కొందరు వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పిల్లా పాపలతో సుఖంగా జీవించాలనుకునే వారు ప్రత్యేక మైన వయసులో పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..

‘లైఫ్ లో సెటిల్ కాంది మ్యారేజ్ చేసుకోను’కొందరు యువకులు నిత్యం చెబుతున్న మాటే. ఇది ఈరోజుల్లో ఆడవారు కూడా చెబుతున్నారు. అయితే జీవితరంలో స్థిరపడాలనుకోవడం తప్పుకాదు. కానీ జీవితంలో రెండు ముఖ్యమే అని గ్రహించాలి.

ఒక వేళ లైఫ్ లో ఎంత సంపాదించినా పెళ్లి ద్వారా సంతృప్తి లేకపోతే తన సంపాదన అంతా వృథానే అని కొందరు పెద్దలు సూచనలు ఉన్నాయి. అయితే పెళ్లికి సరైన వయసు ఏంటి అంటే..?

ఈ రోజుల్లో దాదాపు మగవారికి 30 ఏళ్లు, ఆడవారికి 26 ఏళ్లు దాటిన తరువాత పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే ఈ వయసులో వివాహం చేస్తు సంతాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

అంటే మగవారికి 22 నుంచి 26 సంవత్సరాలలోపు ఆడవారికి 18 నుంచి 22 సంవత్సరాలలోపు పెళ్లి చేయడం ఉత్తమమంటున్నారు. అంతేకాకుండా ఈ వయసులో హర్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండడం వల్ల సంతాన సమస్యలు ఉండవని అంటున్నారు.

ఇక ఆడవారికి 19 నుంచి 24 వయసులోపు పెళ్లిళ్లు చేస్తే గర్భ సమస్యలు కూడా రావని, మిగతా వారి కంటే వీరు సంతృప్తిగా పిల్లల్ని కంటారని తెలుపుతున్నారు. ఇక మగవారికి 30 ఏళ్ల తరువాత, ఆడవారికి 26 ఏళ్ల తరువాత పెళ్లిళ్లు చేస్తే వీరిద్దరికి అప్పటికే హర్మోన్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో సంతాన సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉండగా మగవారికి 30, ఆడవారికి 26 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే సంతాన సమస్యలు పక్కనబెడితే వీరి దాంపత్య జీవితం మాత్రం అన్యోన్యంగా ఉంటుందంటున్నారు. ఈ వయసులో ఉన్నవారు మనసులు స్థిరంగా ఉంటాయని వీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని తెలుపుతున్నారు.

అలాగే మగవారికి 32 దాటినా.. ఆడవారికి 30 దాటిన వాళ్లలో ఎక్కువగా విడాకులు తీసుకున్నవారే ఉన్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *