‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చూస్తే దిమ్మదిరుగుద్ది..

News

సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే చిచ్చరపిడుగులా అనుకుంటారు. ఆవేశంతో కూడిన దూసుకుపోయే డైలాగ్ లతో పంచ్ లు వేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ కేవలం వెండితెరపై మాత్రమే సందడి చేశారు. కానీ ఇటీవల ఆయన టీవీ షోల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రొగ్రాంలో హోస్ట్ గా చేయబోతున్నాడు.

అయితే ఆయన ఈ కార్యక్రమానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడోనన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ వీలు కల్పించుకొని మరీ ఈ ప్రొగ్రాం చేస్తుండడంతో ఆయన తీసుకోబోయే మొత్తంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో 2017లో ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించాడు. ఆప్రొగ్రాంలో హోస్ట్ గా తన పదునైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు రాని క్రేజ్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడంతో మా టీవీ టీఆర్పీ రేటు విపరీతగా పెరిగింది. అయితే ఆ తరువాత ఆయనను మళ్లీ హోస్ట్ గా అనుకున్నప్పటికీ సినిమాల బిజీతో రాలేకపోయాడు. చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.

త్వరలో జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రొగ్రాంలో వ్యాఖ్యతగా చేయనున్నాడు. ఇదివరకే ఆయన ప్రమోషన్లో భాగంగా కొశ్చన్లు మావి.. ఆట మీది.. అనే క్యాప్షన్ తో ప్రమోలో నటించాడు. అంతేకాకుండా ఈ ఆటలో గెలిచినా, గెలవకపోయినా ఆత్మస్థైర్యం పెరగుతుందని అంటూ ప్రేక్షకులను ఉత్తేజపరుస్తున్నాడు.

అయితే ఈ ప్రొగ్రాం కోసం ఎన్టీఆర్ ఎపిసోడ్ కు రూ.కోటి తీసుకుంటున్నారట. మొత్తం 30 ఎపిసోడ్లలో ఎన్టీఆర్ నటించనున్నాడు. అంటే రూ.30 కోట్లతో ఢీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రొగ్రాంలో మంచి ఊపు తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ తన డైలాగ్ లతో ఆకట్టుకుంటాడు అందుకే జూనియర్ నుసెలక్ట్ చేసినట్టలు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published.