కోట్లలో ఆస్తులు కలిగిన అలనాటి అందాలనటి ఎవరో తెలుసా..?

Movie News

అలనాటి అందాలనటి సౌందర్య తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. ఎందుకంటే తెలుగువారికే తెలుగింటి ఆడపడుచు అంటే ఇలా ఉండాలిరా.. అనిపించి అభిమానుల మన్ననలు పొందింది. నిజానికి సౌందర్య తెలుగమ్మాయి కాదంటే నమ్మశక్యం కాదు కానీ తప్పదు కన్నడ భాషకు చెందింది. ఆమె సొంతభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించిన సౌందర్య అతి తక్కువ కాలంలోనే ఎంతో గొప్పనటిగా పేరును సొంతం చేసుకుంది. అలనాటి సావిత్రి, అతిలోకసుందరి శ్రీదేవిల తర్వాత తెలుగు ప్రేక్షకుల నుండి అంతగొప్పగా ఆరాధించబడిన సౌందర్యం సౌందర్యదే. అటు నటనపరంగా ఇటు స్టార్డం పరంగా ఎక్కడా తగ్గలేదు సౌందర్య.

అందరూ సినీపరిశ్రమ అనేసరికి గ్లామర్ పరంగానే ఆకట్టుకొని సెటిల్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. కానీ గ్లామర్ పాళ్ళు తగ్గించి అభినయానికే ప్రాధాన్యత ఇచ్చిన నటి సౌందర్య. కేవలం తన అందమైన నటనతోనే సౌత్ ఇండియా మొత్తం షేక్ చేసింది. అందుకే ఆమె లోకం విడిచి ఇన్నేళ్ళైనా జనాల మాటల్లో ఆమె పేరు బతికే ఉంది. తెలుగుతో పాటు సౌందర్య.. తమిళ కన్నడ మలయాళం హిందీ ఇలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింట్లో నటించి తన మార్క్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ రజిని, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా 90లో తరం హీరోలందరితో సినిమాలు చేసిన ఘనత సౌందర్యకే చెల్లింది. ఇరవై ఏడేళ్ల వయసులోనే లోకం విడిచిపోయిన సౌందర్య.. అప్పటికే వంద సినిమాలకు పైగా నటించింది. ముప్పైయేళ్ల లోపే వంద సినిమాలు చేసిన రికార్డు సౌందర్య నమోదుచేసింది.

సౌందర్య చిన్నసినిమా పెద్దసినిమా అనే తేడాలేకుండా కథ, ఆమె పాత్ర నచ్చితే ఓకే చెప్పేసేదట. డైరెక్టర్, హీరోల గురించి పెద్దగా పట్టించుకునేది కాదట. అందుకే ఆమె కెరీర్ లో హిట్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సౌందర్య మరణించి ఇప్పటికే పదహారేళ్లు గడిచాయి. కానీ ఆమె సినిమాలలో కనబరిచే నటన చూస్తే ఇంకా బ్రతికే ఉందేమో అనిపిస్తుంది. 1992లో సినీరంగప్రవేశం చేసిన సౌందర్య.. తన పన్నెండేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్ అయింది. అయితే ఆ ఒడిదుడుకులకు తన ఫ్యామిలీ సమస్యలు కూడా కారణంగా ఉన్నాయట. అయితే సౌందర్య అందుకున్న అవార్డులు, రివార్డులకు అసలు లెక్కేలేదట. ఆమె సినిమాసినిమాకు అలాంటి అవార్డులు రివార్డులు సహజమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కెరీర్ పరంగా బాగానే గడిచింది. కానీ సౌందర్య ఆస్తులు అప్పట్లోనే కోట్లతో వ్యవహారంలా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. ఇన్నేళ్ళైనా సౌందర్య ఆస్తుల లెక్కలు మాత్రం ఇంకా తేలలేదని తెలుస్తుంది.2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా ప్రాణాలు విడిచాడు.. ఇదిలా ఉండగా.. సౌందర్య ఆస్తుల లెక్క 100కోట్ల పైనే ఉంటుందట. అయితే ఆమె సంపాదన అలా ఎలా పెరిగింది అంటే.. అప్పట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ వలన అన్ని ఆస్తులు కూడా సంపాదించిందని టాక్. 2009లో సౌందర్య ఆస్తి విషయం కోర్టు వరకూ వెళ్ళడం జరిగిందట. సగానికి పైగా ఆస్తులు పంచుకున్న ఫ్యామిలీ మెంబెర్స్ కొన్ని భూముల విషయంలో మాత్రం నోరు విప్పట్లేరని తెలుస్తుంది. అప్పటినుండి పెద్దల సమక్షంలో కూడా ఆస్తి పంపిణీల సంగతి తేల్చుకోవాలని అనుకున్నట్లే గాని కొత్తగా మనస్పర్థలు పెరుగుతూనే ఉన్నాయట. అసలు మనిషే పోయాక.. ఆస్తుల విషయంలో ఇంకా రోడ్డుకెక్కడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మొత్తానికి వపోయేముందే ఆస్తులు కూడగట్టి ఫ్యామిలీకి ఇచ్చేసిపోయింది సౌందర్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *