బిగ్ బాస్ ఇండియన్ రియాలిటీ టెలివిషన్ గేమ్ షో . బిగ్ బాస్ తెలుగు ,తమిళ్,హిందీలోనే కాకుండా అనేక భాషల్లో పాపులర్ అయిన గేమ్ షో.హిందీలోనే ఈ గేమ్ షోను బిగ్ బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు .అయితే కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్లో స్టూడెంట్స్ స్పెషల్షో గా నిర్వహిస్తున్నారు.కేవలం విద్యార్థులకు మాత్రమే ఎంట్రీ ఉన్న టైంలో పిల్లలు పిడుగుల్లా వచ్చిపడ్డారు. పెద్దవారికి తెలివితేటల్లో మీమేమీ తీసిపోవడం లేదని నిరూపించారు. సోమవారం జరిగిన ఏపిసోడ్‌లో అన్మోల్ శాస్త్రి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్‌లో గెలిచి హాట్‌సీటులో కూర్చున్నాడు.ఇతడు గుజరాత్‌కు చెందిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.హాట్‌సీటులో కూర్చున్నఅన్మోల్ శాస్త్రి , బిగ్ బీ అమితాబ్ ఎదురుగా కూర్చున్నాగాని ఏ మాత్రం కంగారుపడలేదు.
ఈ బుడతడు అమితాబ్ బచ్చన్ నే రివర్స్‌లో ప్రశ్నలు వేస్తూ ఆశ్చర్యయింపచేసాడు.బిగ్ బీ ని దగ్గర నుంచి చూడగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు అన్మోల్ . చిచ్చర పిడుగుకు కి తాగమని వాటర్ ఇచ్చి.. హాట్‌సీటులో కూర్చొపెట్టిన అమితాబ్.. తర్వాత అన్మోల్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.పెద్దయ్యాక నువ్ ఎం అవ్వాలనుకుంటున్నావ్ అన్న ప్రశ్నకు…తనకున్న మూడు కోరికల గురించి వెల్లడించాడు అన్మోల్.ఒకటి నోబెల్ ప్రైజ్ గెలవడం,రెండవది ప్రపంచంలోనే అత్యంత భానవంతుడిగా నిలవడం, మూడవది ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలని భావిస్తున్నట్లు అన్మోల్ తెలియచేసాడు.తనకు ఇష్టమైన శాస్త్రవేత్తలు అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ అని తెలిపాడు.షో లో గెలిచినా డబ్బుతో ఏమిచేస్తావ్ అని అడిగితే గెలిచిన డబ్బుతో ఓ టెలిస్కోప్ కొంటానని చెప్పి ఆశ్చర్యపరిచాడు అన్మోల్.
ఆ బుడతడి మాటలకి ముగ్ధుడయినా అమితాబ్ ‘జిగ్యసు’ అని నిక్‌నేమ్ పెట్టాడు. 20 వేల రూపాయల ప్రశ్న అడగగా ఏమాత్రం తడబాటు లేకుండా అన్మోల్ సమాధానం చెప్పడంతో బిగ్ బీ ఆశ్చర్యపోయాడు.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే కామిక్ బుక్స్ ప్రకారం ఓ టీనేజర్ని రేడియోయాక్టివ్ సాలీడు కుడుతుంది. దాంతో మానవాతీత శక్తులు వచ్చి ఎత్తైన గోడల్ని అలవోకగా ఎక్కుతుంటాడు అని అమితాబ్ అడిగారు. ఆప్షన్ చెప్తుండగానే పీటర్ పార్కర్ అని కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు ఈ బుడతడు. అన్మోల్ ఆక్టివ్ నెస్ చుసిన అమితాబ్ తనకు భవిష్యత్తులో అన్మోల్ వల్ల తన హోస్ట్ జాబ్‌కి ప్రమాదం ఉంటుందని సరదాగా మాట్లాడారు .
అన్మోల్ తన రెండో ప్రశ్నకు 50-50 లైఫ్‌లైన్ వాడుకున్నాడు. తరువాత ఏడవ ప్రశ్నకు మూడవ లైఫ్‌లైన్ కూడా వాడుకున్నాడు. దాని తర్వాత 25 లక్షల రూపాయల ప్రశ్నకు తన చివరి లైఫ్‌లైన్ నూ వాడేసుకున్నాడు.ప్రశ్న ఏంటంటే టెలిస్కోప్ సాయంతో గుర్తించిన మొదటి గ్రహం ఏది ? అన్న ప్రశ్నకు తన చివరి లైఫ్‌లైన్ వాడుకుని సరైన సమాధానం యూరెనస్ అని చెప్తాడు అన్మోల్.ఆ తర్వాత అడిగిన 50 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తెలివిగా క్విట్ అయ్యాడు. అన్మోల్ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు.ఒక పిల్లవాడు ఇంత పెద్ద మొత్తం గెలవడం అంటే సాధారణ విషయం కాదు.