ఓ డైరెక్టర్ మొదటగా అసిస్టెంట్ కెమరామెన్ గా చేరి ఆ తర్వాత మెల్లగా టాలెంట్ తో సినిమాటోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ. ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ సినిమాటోగ్రాఫర్. కానీ దర్శకుడుగా మారాలనే ఉద్దేశంతో చిత్రం సినిమా రూపొందించి ట్రెండ్ సెట్ చేసాడు తేజ. తన ప్రతి సినిమాలో కొత్త నటులను ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు తేజ.
అలా ఆయన దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ స్టేటస్ అందుకున్న యాక్టర్స్ చాలామంది ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికి స్టార్స్ గా కొనసాగుతున్నారు. మరి డైరెక్టర్ తేజ డిఫరెంట్ సినిమాలు తీస్తూ ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు. మరి తేజ దర్శకత్వంలో కెరీర్ ప్రారంభించిన పన్నెండు మంది యాక్టర్స్ ఎవరో చూద్దాం!
1. ఉదయ్ కిరణ్: తేజ దర్శకుడుగా మారిన తొలిచిత్రం ‘చిత్రం’. తన ఫస్ట్ సినిమాతోనే ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తేజ – ఉదయ్ కిరణ్ కాంబోలో నువ్వునేను, ఔనన్నా కాదన్నా సినిమాలు వచ్చాయి. కానీ అవి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
2. సదా: యాక్ట్రెస్ సదా.. తేజ తెరకెక్కించిన జయం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటినుండి సదా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ కోలీవుడ్ స్టార్స్ అందరితో సదా సినిమాలు చేసింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఔనన్నాకాదన్నా సినిమా వచ్చింది.
3. రీమాసేన్: తేజ స్కూల్ నుండి వచ్చిన మరో స్టార్ హీరోయిన్. ఎందుకంటే చిత్రం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రీమా.. తక్కువ కాలంలోనే రవితేజ, తరుణ్ ఇలా అందరు హీరోలతో సినిమాలు చేసింది. చిత్రం సినిమా తర్వాత రీమా ఉదయ్ కిరణ్ తో రెండు మూడు సినిమాల్లో నటించింది.
4. నితిన్: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు నితిన్. తేజ దర్శకత్వంలో జయం సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్.. అప్పటినుండి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసాడు నితిన్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
5. కాజల్ అగర్వాల్: తేజ ఇంట్రడ్యూస్ చేసిన స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీకళ్యాణం అనే సినిమాతో కాజల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ వయ్యారి దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాలు చేసేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్-2 సినిమాలు చేస్తోంది.
6. దక్షా నగర్కర్: తేజ దర్శకత్వంలో రూపొందిన హోరాహోరీ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ దక్షా నగర్కర్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉందట. హుషారు మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఇటీవలే దక్షా జాంబిరెడ్డి అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకుంది.
7. రాజా చెంబోలు: తేజ తెరకెక్కించిన కేక.. అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నటుడు రాజా చెంబోలు. హీరోగా నిలబడలేకపోయాడు. కానీ సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఫిదా, ఎవడు, మిస్టర్ మజ్ను, భానుమతి అండ్ రామకృష్ణ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
8. నందిత: తేజ దర్శకత్వంలో ‘నీకు నాకు డాష్ డాష్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది నందిత. ఆ తర్వాత ప్రేమకథచిత్రం, లవర్స్ లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. కానీ హీరోయిన్ గా స్టార్డం సంపాదించుకోలేకపోయింది.
9. నవదీప్: 2004లో తేజ తెరకెక్కించిన జై అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు నవదీప్. ఆ తర్వాత చాలా హిట్స్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ రోల్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటున్నాడు. కానీ తేజ నుండి వచ్చిన నవదీప్ కొన్నేళ్లు స్టార్డం అయితే చూసాడు.
10. ప్రిన్స్: తేజ దర్శకత్వం వహించిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో హీరోగా మారాడు ప్రిన్స్. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత రొమాన్స్, బస్టాప్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధం అంటున్నాడు.
11. సంతోషి: నవదీప్ తో పాటు జై సినిమాతో హీరోయినుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సంతోషి. ఆ తర్వాత పలు సినిమాలలో మెరిసింది కానీ సెటిల్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం అయితే ఎలాంటి సినిమాలలో సంతోషి పేరు వినిపించడం లేదు. తేజ ఇంట్రడ్యూస్ చేసిన అందమైన హీరోయిన్స్ లో ఈమె ఒకరు.
12. ఆది పినిశెట్టి: సీనియర్ స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి. తేజ దర్శకత్వంలో ‘ఒక v చిత్రం’ అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆది. ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చివరిగా రంగస్థలం, నీవేవరో సినిమాలతో హిట్స్ అందుకున్నాడు.
ఈ విధంగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో పరిచయమైన నటులు చాలామందే ఉన్నారు. వారిలో కమెడియన్ సుమన్ శెట్టి, నాగిని ఫేమ్ అనిత కూడా తేజ స్కూల్ నుండి వచ్చినవారే. ప్రస్తుతం వారివారి కెరీర్లతో హ్యాపీగా ఉన్నారు. కానీ డైరెక్టర్ తేజనే గత కొన్నేళ్లుగా హిట్స్ కోసం ట్రై చేస్తున్నాడు.