దయచేసి నన్ను ఆదుకోండి: ప్రముఖ నటుడి ఆవేదన

News

సినిమాల్లో నటించినంతా కాలం బాగానే కనిపించిన కొందరు నటులు ఆ తరువాత వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఐరెన్ లెగ్ శాస్త్రి, మనోరమ లాంటి వారు సినిమాల్లో ప్రముఖంగా కనిపించినా చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారి చనిపోయారు. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖంగా ఓ వెలుగు వెలిగిన నటుడు పొన్నంబల్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్ హీరోల పక్కన నటించిన ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో దీనావస్థలో ఉన్నాడు. తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా పలువురిని వేడుకొంటున్నాడు.

పొన్నంబళ్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాలో పవన్ ఎంట్రీ సమయంలో పొన్నంబల్ కనిపిస్తాడు. అయితే ప్రస్తతం ఆయనకు కిడ్నీ ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కిడ్నీ ఇవ్వడానికి తన సోదరి కుమారుడు ముందుకు వచ్చాడు. అయితే ఆర్థికంగా మాత్రం చితికిపోయిన ఆయనను ఆదుకోవాలని ఆసుపత్రి నుంచే వేడుకుంటున్నాడు.

ఇప్పటి వరకు ఆయనకు రజనీకాంత్, కమల్ హాసన్ వంటివారు సాయం చేశారు. అయితే మరింత డబ్బు అవసరం ఉండగా ఇలా ఆసుపత్రిలోని బెడ్ పై నుంచే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయం తెలిసిన కొందరు పొన్నంబల్ కు సాయం చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో ఇంకొందరు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దక్షిణాది ఫిలిం సంఘం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *