నడవలేని స్థితికి సుధాకర్ మారడానికి కారణాలు ఏమిటి..?

Trending

సినిమాల్లో అవకాశాలు ఉన్నంతసేపు చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంటుంది. అయితే అవకాశాలు తగ్గిన తరువాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడైన సుధాకర్ కామెడీకి నవ్వలేని వారుండరు. ఆయన చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాకుండా తమిళంలో స్టార్ హీరోగా అయన ఎన్నో సినిమాలు చేశారు. అయితే రాను రాను సుధాకర్ పరిస్థితి దీనంగా తయారైంది. సుధాకర్ స్నేహితుడైన చిరంజీవి ఇంకా హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన మాత్రం మరొకరి సాయంతో నడుస్తున్నాడు. ఈ పరిస్థితి ఎదురవడానికి కారణం ఏంటి..?

టాలీవుడ్లో హీరోలతో సమానంగా కమెడియన్లకు ప్రాధాన్యం ఉంటుంది. కొందరు కమెడియన్లు ప్రధానంగా హీరోగా నటించిన సినిమాలు కూడా వచ్చాయి. అయితే వీరిలో కొందరు మాత్రమే తమ పూర్తి జీవితాన్ని సినిమాకు కేటాయించారు. ఇంకొందరు మధ్యలోనే ఇండస్ట్రీని విడిచి వెళ్లారు. నటుడు సుధాకర్ పాతకాలం సినిమాల నుంచి టాలీవుడ్లో కొనసాగుతున్నారు. అయితే ఆయనకు తమిళంలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం కమెడియన్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ మాత్రమే వచ్చాయి.

సినిమాల్లో సుధాకర్ ను చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. కానీ ఆయనను ప్రస్తుతం రియల్ గా చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. 1956 ఫిబ్రవరి 1 లో జన్మించిన సుధాకర్ ప్రకాశం జిల్లాలోని మార్కపురంలో జన్మించారు. సుధాకర్ తండ్రి రత్నం. ఈయన డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఈ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో అందులో సుధాకర్ చివరివాడు. సుధాకర్ విద్యాభ్యాసం ఎక్కువగా ఏలూరు, గుంటూరులో జరిగింది.

సుధాకర్ చిరంజీవితో కలిసి సినిమాల కోసం చాలా కష్టపడ్డారు. హరిప్రసాద్ తదితరులతో కలిసి వీరు మద్రాసుకు వెళ్లారు. భారతీరాజా ‘కిలుక్యం పొంగం’ అనే సినిమాలో అవకాశం ఇవ్వడంతో కెరీర్ ప్రారంభమైంది. తెలుగులో ‘సృష్టి రహస్యాలు’తో తెరంగేట్రం చేశాడు. తెలుగులో వివిధ పాత్రలో నటించారు. చిరంజీవితో కలిసి ‘యముడికి మొగుడు’ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

సుధాకర్ తమిళంలో స్టార్ హీరో వరకు వెళ్లిన ఆయన అనారోగ్యంతో 2010 జూన్ 29న కోమాల్లోకి వెళ్లాడు. తిరిగి 2015లో కోలుకున్నారు. అయితే సినిమాల్లో నటించినప్పుడు ఆయన కోట్లలో ఆస్తులు కూడబెట్టాడట. అయితే అనారోగ్యం కారణంగా అవన్నీ కరిగిపోయానని అంటున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సుధాకర్ ఓటు వేయడానికి వచ్చాడు. అయితే ఆయన పరిస్థితిని చూసిన సినీ ప్రియులు ఒక్కాసరిగా షాక్ నకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published.