పవన్ కల్యాణ్ డబ్బింగ్ ఎలా చెబుతున్నాడో చూశారా..? షాకవుతారు..

Movie News

మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు త్వరలో సినిమా పండుగ జరగనుంది. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ వచ్చే నెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాకు అందిస్తున్న చిత్రం యూనిట్ తాజాగా మరో న్యూస్ తో ఫ్యాన్స్లో జోష్ పెంచింది. పవన్ డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫొటోలు నెట్లో దర్శనమివ్వడంతో అవి వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో విజయం సాధించిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు వేణు శ్రీరామ్. ‘వకీల్ సాబ్’ పేరుతో నిర్మీతమైన ఈ సినిమాకు దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తగా ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేయబోతున్న ఈ సినిమాత ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. పవన్ ఇందులో వకీల్ గాను, సాధారణ వ్యక్తిగా కనిపించనున్నాడు.

దాదాపు మూడేళ్ల తరువాత పవన్ సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వెండితెరపై పవన్ ను చూసేందుకు అభిమానులు ఉర్రూతలాడుతుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా పవన్ డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తాజాగా ఆయన డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఆ ఫొటోలను వైరల్ చేసేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.