Pulwama

పుల్వామా అమరవీరుడు మేజర్ ధౌండియాల్ భార్య నితికా కౌల్ భారత సైన్యంలో చేరారు..!

News

పుల్వామాలో ప్రాణాలు అర్పించిన తన భర్త మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అడుగుజాడలను అనుసరించి, నితికా కౌల్ శనివారం ఆర్మీ యూనిఫాంను ధరించి ఉండగా ఆర్మీ యొక్క ఉత్తర కమాండ్, కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై కె జోషి ఆమె ఆర్మీ యూనిఫర్మ్ భుజాలపై స్టార్స్ ని ధరింపజేసాడు. తమిళనాడులోని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జెఎం ఉగ్రవాదుల దాడిలో ఫిబ్రవరి 2019లో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరవీరుడు అయ్యాడు,దాంతో అతని భార్య అధికారికంగా లెఫ్టినెంట్ నితికా కౌల్ ధౌండియాల్ భారత సైన్యంలో చేరారు.కౌల్ కు ప్రశంసలు తెలుపుతూ రక్షణ మంత్రిత్వ శాఖ PRO ఉధంపూర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సంక్షిప్త వీడియోను షేర్ చేసింది.

Pulwama

మరికొందరు కూడా కౌల్‌ను ట్వీటర్ ద్వారా ప్రశంసించారు మరియు వారిలో ఒకరు “… దివంగత భర్తకు ఎంత గొప్ప నివాళి. నిజంగా స్ఫూర్తిదాయకమైన కథ. ” అని అన్నారు. మేజర్ ధౌండియాల్ ప్రాణాలతో పోరాడుతు పుల్వామా ఉగ్రవాదుల తో యుద్ధం చేసాడు కాబట్టి అతను దేశం కోసం చేసిన త్యాగానికి షౌర్య చక్రం ని ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది.

తన భర్త మరణించిన ఆరు నెలల తరువాత, నితికా షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్ష మరియు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూను క్లియర్ చేసింది మరియు ఆమె శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ) లో నియమించబడింది. పుల్వామా జిల్లాలో జెఎమ్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు ఆర్మీ వ్యక్తులలో డెహ్రాడూన్ నివాసి మేజర్ ధౌండియాల్ కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 14 న సిఆర్పిఎఫ్ కన్వోయ్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు చంపబడ్డారు.

దేశ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందుకు మేజర్ను ప్రశంసిస్తూ, నితికా ఇలా అన్నారు: “నేను నిజంగా గర్వపడుతున్నాను, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాము.ఈ ప్రేమ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మీరు మీ జీవితాన్ని త్యాగం చేసి కాపాడిన ప్రజలను మీరు ఎన్నడూ కలుసుకోకపోవచ్చు, కాని వారి కోసం మీ జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ” “మీరు ఎంతో ధైర్యవంతులు. నిన్ను నా భర్తగా పొందుకున్నందుకు నాకు చాలా గర్వాంగా ఉంది. నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. నా జీవితాంతం మీకు రుణపడి ఉన్నాను. అవును, మీరు వెళ్ళిపోవడం బాధగా ఉంది, కాని నాకు తెలుసు ఎల్లప్పుడూ మీరు నా చుట్టూ ఉంటారని”, ఆమె చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *