భయపెట్టిన ‘ఆర్జీవీ దెయ్యం’..: మూవీ రివ్యూ

Movie Review

దెయ్యాలు సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ కు మంచి పట్టుంటుంది. ఆయన తీసిన దెయ్యం సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి రకరకాల కథలతో ఇలాంటి సినిమాలు తీశారు. తాజాగా ‘ఆర్జీవీ దెయ్యం’ పేరుతో మరోసినిమా తీశాడు. వాస్తవానికి ఈ సినిమాల ఆరేళ్ల కిందటే ప్రారంభమైంది. ముందుగా దీనికి ‘పట్టపగలు’ అనే పేరును డిసైడ్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ‘ఆర్టీవీ దెయ్యం’ గా నామకరణం చేశారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన ఈ సినిమా శుక్రవారం వెండితెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

నటులు:
రాజశేఖర్, స్వాతిదీక్షిత్, ఆహుతి ప్రసాద్, దేవదాస్ కనకాల, బెనర్జీ, సన, అనితా చౌదరి,

కథ:
కారు మెకానిక్ గా పనిచేసే శంకర్ (రాజశేఖర్ ) కూతురు విజ్జీ(స్వాతి దీక్షిత్). వీరిద్దరు ఎంతో హ్యపీగా జీవనం సాగిస్తుంటారు. విజ్జీ కాలేజీ స్టూడెంట్. రాను రాను ఆటోమెటిక్ గా ఆమెలో పలు మార్పులు వస్తుంటాయి. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. అయితే వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం ఉండదు. చివరికి విజ్జీ ప్రవర్తలో మరింత మార్పులు వచ్చి మగాడి గొంతుతో మాట్లాడుతుంది. ఆ తరువాత అప్పటి వరకు జరిగిన హత్యలన్నింటికీ తనే కారణమంటుంది. అయితే విజ్జీ అలా ఎందుకు ప్రవర్తించింది..? ఆ తరువాత ఏం జరుగుతుంది..? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
మనుషుల్లో దయ్యాలు ఆవహించడం లాంటి సినిమాలను మనం చూశాం. కానీ కొన్ని సినిమాల్లో ముందుగా దెయ్యం పేరుతో భయపెట్టి ఆ తరువాత ఇదంతా ఉత్తుత్తినే అని కొన్ని సినిమాలు చూపించాయి. కానీ ఈ సినిమాలు అలాంటిది కాకుండా ఆత్మలు మనుషుల్లో నిజంగా ఆవహిస్తాయని చెప్పుకొచ్చారు. మనుషుల నుంచి దయ్యాలను భూత వైద్యులు ఎలా వెళ్లగొడుతారనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. పట్టపగలే మనుషుల్లో ఈ ఆత్మలు తిరుగుతుంటాయని చూపించి భయపెట్టారు. అయితే విజ్జీలో ఆ అత్మ ఎందుకు ప్రవేశించిందనే విషయం కథ సాగుతుంది.

ఎవరెలా చేశారంటే..?
హీరో రాజశేఖర్ పాత్ర ఇందులో పెద్దగా ఆకట్టుకోదు. తన కూతురు ఇలా మారిందేంటి..? అన్న టెన్షన్లో మాత్రమే కనిపిస్తాడు. దీంతో అతని ఫర్ఫమెన్స్ చూపించే అవకాశం రాలేదు. అయితే స్వాతి దీక్షిత్ నటనపైనే సినిమా ఆధారపడింది. ఆమె వాయిస్ లు మార్చిన గెటపుల్లో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

Leave a Reply

Your email address will not be published.