వామ్మో… సాయి పల్లవి సంపాదన ఈ రేంజ్ లో ఉందా…?

Trending

సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఆ పాత్రను ఎంత సమర్ధవంతంగా చేయొచ్చో ఈ మధ్య కాలంలో సాయి పల్లవి ప్రూవ్ చేసినట్టు మరో హీరోయిన్ చేయలేదు అనే మాట వాస్తవం. ఇతర హీరోయిన్ ల మాదిరిగా స్కిన్ షో చేయకపోయినా ఓవర్ మేకప్ లేకపోయినా సరే ఈ హీరోయిన్ మాత్రం ఫాన్స్ ని తన నటనతో డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకుంటుంది అనే మాట వాస్తవం.

ఆమెకు సినిమాలో ఇస్తున్న పాత్ర హీరోని కూడా డామినేట్ చేస్తుంది. తెలుగులో ఒకప్పుడు విజయశాంతి, శ్రీదేవి లాంటి హీరోయిన్ లు హీరోని డామినేట్ చేసారు. కాని ఈ మధ్య కాలంలో హీరోల డామినేషన్ ఉంటుంది. వారిని సాయి పల్లవి ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అయితే సంపాదన విషయంలో సాయి పల్లవి చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది. సినిమాకు ఆమె దాదాపుగా కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటుంది.

అయితే తనకు ప్రాధాన్యత లేని పాత్ర అయితే ఏ హీరో సినిమా అయినా సరే పక్కన పెట్టేస్తుంది. ఈ క్రమంలో గత 3 ఏళ్ళ నుంచి ఒక 3 కోట్ల వరకు నష్టపోయింది. తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టిన ఈ భామ… అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఆమె విరాట పర్వం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో పేదింటి యువతీగా ఆమె నటిస్తుంది.

సామంత, అనుష్క తో పాటుగా సంపాదిస్తుంది ఈ అమ్మాయి అని ఒక సంస్థ చెప్పింది. 2020 లో సాయి పల్లవి మూడు మిలియన్ డాలర్ల వరకు సంపాదించారని ఆ సంస్థ పేర్కొంది. సమంతా… అనుష్క ఇద్దరూ రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రమంగా వారికి దగ్గరగా సాయి పల్లవి వెళ్ళడం మాత్రం ఆమె ఫాన్స్ ని బాగా ఖుషీ చేస్తున్న అంశం.

1.

2.

3.

4.

5.

6.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *