వైరల్ అవుతున్న ట్రెండీ హీరోయిన్.. చైల్డ్ హుడ్ పిక్స్!

Movie News

టాలీవుడ్ ఇండస్ట్రీలో పరభాషా హీరోయిన్స్ హవా రోజురోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం కుర్ర హీరోయిన్స్ అడుగుపెడుతూ సెటిల్ అయిన స్టార్ హీరోయిన్స్ వైపు చూడనివ్వడం లేదట. అలాగే ట్రెండ్ తగ్గట్టు దర్శకనిర్మాతలు కూడా కొత్తనీరులాగే కొత్త హీరోయిన్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే కొత్తవాళ్ళైతే రెమ్యూనరేషన్ తక్కువలో ఎంతోకొంత ఇచ్చి వదిలించుకోవచ్చు. అలాగని పర్టిక్యూలర్ కారణం ఇదే కాదు. ఎందుకంటే సినీ ప్రేక్షకులలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. చూసేచూపులో.. మారుతున్న టెక్నాలజీలో.. ఫాలో అవుతున్న ట్రెండ్ ప్రకారం.. సినిమాలను అభిమానించే యూత్ నవయువ అందాలను కోరుకుంటూ ఉంటారు.

1. 2. 3. 4.

ఇలాంటి కీలకమైన పాయింట్స్ లెక్కలోకి తీసుకొని యువ హీరోయిన్లకు పిలిచి మరీ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా ట్రెండ్ సృష్టించిన హీరోయిన్ ఎవరంటే.. ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే కృతిశెట్టి పేరే చెప్పుకోవాలి. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ ప్రస్తుతం టాలీవుడ్ అవకాశాల ఉప్పెనను తనవైపు తిప్పుకుందట. అందుకే కేవలం ఒక్క సినిమాతో లేతసోయగం మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోలందరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటీగా మారింది.

నిజానికి పంజా వైష్ణవ్ తెలుసు కదా.. అదేనండి మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమాతోనే కృతి కూడా ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఉప్పెన సినిమాలో హీరోకంటే కూడా హీరోయిన్ కృతికి ఎక్కువగా ఆకర్షించింది. ఎందుకంటే అమ్మడు అందమైన నవ్వుతో, ఆకట్టుకునే రూపంతో.. అచ్చమైన తెలుగు అందాలతో దర్శనమిచ్చే సరికి సినిమా పోస్టర్ రిలీజ్ నుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకా సాంగ్స్, సినిమా విడుదల అయ్యే సమయానికి ఓ స్టార్ హీరోయిన్ రేంజిలో నేమ్ ఫేమ్ సొంతం చేసుకుంది. మొత్తానికి సినిమా విడుదలై మంచి విజయం సాధించి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

మొదటి సినిమా అయినా కృతి యాక్టింగ్ ఇరగదీసింది అనే చెప్పాలి. ఎందుకంటే లవ్ ఎక్సప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఫీల్ చాలాబాగా మెయింటైన్ చేసింది.

అలాగే ప్రశంసలు కూడా అందుకుంది. మెగాస్టార్ లాంటివారే కృతిని ఆకాశానికి లేపారంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ కుర్రభామ ఎఫెక్ట్ ఎంతలా పాకిందో.. అయితే ఫస్ట్ సినిమా విడుదలయ్యేలోపే నానితో శ్యామ్ సింగరాయ్, అలాగే సుధీర్ బాబుతో ఓ సినిమా ఓకే చేసింది. అయితే కృతికి స్టార్ హీరోల నుండి పిలుపు వచ్చే అవకాశం సంగతి పక్కన పెడితే.. యంగ్ హీరోలు, మీడియం హీరోలు మాత్రం కృతిని వదిలేలా లేరు. ఉప్పెన సినిమాతో ఫ్రెష్ బ్యూటీ.. మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. కృతికి టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా కోలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. ఇటీవలే తమిళ హీరో కార్తీ అప్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా కృతికి పిలుపొచ్చిందని టాక్. అలాగే హీరో రామ్ – లింగుస్వామి సినిమాలో కూడా కృతిని ఫైనల్ చేస్తారని టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కృతి చైల్డ్ హుడ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఎంతో క్యూట్ గా ముద్దుగా కృతి.. అప్పట్లోనే ఫోటోలకు అంత అందంగా పోజిచ్చింది. అంటే చిన్నప్పుడే మోడలింగ్ వైపు అడుగులు వేసేలా ఫోటోస్ ప్రభావం పడిందని చెప్పాలి. చిన్నప్పుడు తన తండ్రితో దిగిన ఫోటోలతో పాటు మరిన్ని యాడ్ షూట్స్ కు సంబంధించిన కృతి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తుళు భాషకు చెందిన కృతి ప్రస్తుతం బెంగుళూరులో ఉంటుందని సమాచారం. చూడాలి మరి ఈ వయ్యారి ఫ్రెష్ గాలి తెలుగు కుర్రాళ్ళకు ఎప్పటివరకు ఆకట్టుకుంటుందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *