తెలుగు చిత్ర సీమలో శోభన్ బాబు అంటే ఎవరు తెలియని వారుండరు. అందగాడు.. అందంగా నటించేవాడే కాదు.. అందరికీ ఆప్యాయతను పంచిన హీరో అని చెబుతుంటారు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత శోభన్ బాబుకే ఎక్కువగా క్రేజీ ఉండేంది. ఒక దశలో ఆయకు బాయ్స్ ఫ్యాన్స్ కంటే లేడీ ఫాలోయింగ్ ఎక్కవగా ఉండేదంటే ఆశ్చర్యం కాదు. అందుకే ఆయన చివరి వరకు హీరోగానే నటించి సినిమాల నుంచి తప్పుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటుల్లో అత్యధికంగా సంపాదించిన నటుల్లో శోభన్ బాబు ఒకరున్నారు. ఆయన సినిమాల ద్వారా వచ్చిన సొమ్మును మరో రంగంపై పెట్టి కూడబెట్టారు. మొత్తానికి ఆయన ఎంత కూడబెట్టాడో తెలిస్తే షాకవుతారు..?
సినిమా రంగంలోకి ఎంతో ఆశతో వచ్చిన వారిలో కొందరు జీవితాలను నాశనం చేసుకున్నవారున్నారు.. మరికొందరు మూడు తరాలు తిన్నా కరగని ఆస్తులను కూడబెట్టుకున్నవారున్నారు. ఇందులో రెండో రకానికి చెందిన వారు నటుడు శోభన్ బాబు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతుల్లో శోభన్ బాబు ఉన్నారు. ఆయనకు అవకాశం వచ్చిన ప్రతీ సినిమాను చేస్తూ వచ్చిన సొమ్మంతా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. అవసరమున్న ప్రతీ చోట భూములు కొనుగోలు చేశాడు. ఓ రోజు ఉదయం ఆయన భూములన్నీ చూద్దామని వెళితే తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యేదట.
ప్రస్తుతం ఆ భూములు కోట్లలోనే ధరలు పలుకుతున్నాయి. శోభన్ బాబు తాను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఇతరులకు కూడా సలహాలు ఇచ్చేవాడు. ఆలా ఆయన సలహా పాటించి ధనవంతులైన వారిలో మురళీమోహన్ ఉన్నారు. ఏపీలో అనేక భూములున్న వారిలో మురళీ మోహన్ ఒకరు. ఇక ఆయన దగ్గర పనిచేసిన ఓ డ్రైవర్ శోభన్ బాబు సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడాట.
ప్రస్తుతం ఆయన భూముల విలువ కోట్లకు చేరిందట. ఇక ఆయన సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చే రేంజ్ కి ఎదిగిపోయాడంటే ఎంత సంపాదించిండో అర్థం చేసుకోవచ్చు. అలా శోభన్ బాబు తాను ఆస్తులను కూడబెట్టడమే కాకుండా ఇతరులకు సలహాలు ఇచ్చి వారిని అభివృద్ధి చేశాడు. చివరి నిమిషం వరకు హీరోగానే పనిచేసిన ఆయన చెన్నై వెళ్లి స్థిరపడ్డాడు.