సినిమాల్లో అవకాశాలు రావాలంటే అందంగా కనిపించాలి. కొందరికి అవకాశాలు వచ్చినా అందంగా లేవన్న కారణంతో పక్కనబెడుతుంటారు. ఇలా పక్కనబెట్టే సమయం రాకముందే కొందరు నటులు అలర్టయ్యారు. అందంలో భాగమైన లావు నుంచి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు సన్నగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకొని అందంగా ఉండేందుకు ట్రై చేశారు. అయితే కొందరు అలా చేసిన వారిలో సైడ్ ఎఫెక్ట్ వచ్చి మరణించిన వారూ ఉన్నారు. వారెవరో చూద్దాం..
ఆర్తీ అగర్వాల్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ నటి అని తెలుసు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. అయితే కొన్ని రోజుల తరువాత లావు కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో కామెడీ హీరోల పక్కన నటించాల్సి వచ్చింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె సన్నగా అయ్యేందుకు లైపోసెషన్ చేయించుకుంది. అయితే సర్జరీ చేయించుకున్నాక వికటించి మరణించారు.
దాసరి నారాయణ గురించి టాలీవుడ్ లో ఎవరైనా చెబుతున్నారు. తెలుగు సినిమా దిగ్గ దర్శకుల్లో ఒకరైన ఆయన సినిమాలకు నిర్మాతగా.. దర్శకుడిగా.. నటుడిగా ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి సినిమాలు అందించిన ఈయన పర్సనల్ లైఫ్ విషాదంగానే ముగిసింది. ఈయన అందం కోసం కాకపోయినా సన్నగా అయ్యేందుకు సర్జరీ చేయించుకున్నాడు. అయితే అది వికటించి ఆయన కూడా మరణించాడు.
బాలీవుడ్ నటి మిస్తీ ముఖేర్జి హిందీలోనే కాకుండా బెంగాలీ చిత్రాల్లో అలరించింది. హిందీలో ఎక్కువగా ఐటెం సాంగ్ లను చేస్తూ అలరించిన ఈ భామ తక్కవ సినిమాలతోనే ఫేమన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజుల తరువాత లావయింది. దీంతో సన్నగా అవ్వాలని కిటో డైట్ ని పాలో అయింది. అయితే దీంతో ఆమె కిడ్నీలు పాడయ్యాయి. ఆ తరువాత ఎంత ఖర్చపెట్టినా బతకలేకపోయింది.