samantha

స్టార్ హీరోయిన్ సమంత వదులుకున్న టాప్ మూవీస్!

Movie News

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సినీ ఇండస్ట్రీలో సమంతకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీకి ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన సామ్.. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా ఆఫర్స్ దక్కించుకొని స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఒకవైపు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి సమంత చైతూ ఇద్దరు కూడా ఏ మాయ చేసావే మూవీ షూటింగ్ టైంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ తర్వాత సినిమా షూట్ ఎండింగ్ వచ్చేసరికి ఇద్దరి మధ్య ఉంది అట్రాక్షన్ కాదు లవ్ అని తెలుసుకున్నారు.

ఆ తర్వాత కొన్ని సినిమాలలో కలిసి పనిచేసారు కానీ ఎక్కడా లవ్ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక చివరికి 2017లో నాగచైతన్య సమంతలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉండగా సమంత తన కెరీర్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, నితిన్, శర్వానంద్, ఎన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్.. అటు తమిళంలో కూడా విక్రమ్, దళపతి విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్ ఇలా అందరితో నటించింది. ఇటీవలే సమంత వెబ్ సిరీస్ తో బాలీవుడ్ డెబ్యూ చేసింది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 త్వరలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

samantha

తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో అరుదైన ఫీట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్స్ ఫాలోయర్స్ సొంతం చేసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే.. సామ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కానీ ఈ పదేళ్లలో సమంత వదులుకున్న టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం!

1. కడలి: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ సమంత దగ్గరికే వచ్చిందట. కానీ ఎందుకో సామ్ నో చెప్పింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు. కానీ మ్యూజికల్ గా మాత్రం సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి.

2. ఎవడు: రాంచరణ్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా ఇది. మొదటగా వంశీ పైడిపల్లి శృతిహాసన్ క్యారెక్టర్ సమంతనే అడిగారట. మరేం అయిందోగాని సామ్ రిజెక్ట్ చేసిందట.

3. ఐ మనోహరుడు: చియాన్ విక్రమ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్పరిమెంటల్ సినిమా ఇది. అమీజాక్సన్ క్యారెక్టర్ సామ్ చేయాల్సిందట. కానీ ఎందుకో నో చెప్పేసిందట.

4. బ్రూస్ లీ: రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. మరి సామ్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసిందట. కానీ రంగస్థలంలో రాంచరణ్ తో ఆడిపాడింది.

5. నిన్నుకోరి: నాని, నివేద థామస్ జంటగా రూపొందిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని సామ్ రిజెక్ట్ చేసిన వాటిలో ఒకటి. కాని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది.

6. యూటర్న్: ఈ మూవీ తెలుగు రీమేక్ లో సమంత నటించి మెప్పించింది. కానీ హిందీలో రీమేక్ అవుతున్న ఇదే సినిమాకు నో చెప్పిందట. కానీ సామ్ యూటర్న్ లో బాగానే యాక్టింగ్ చేసింది.

7. ఎన్టీఆర్ కథానాయకుడు: బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర గురించి సంప్రదిస్తే నో చెప్పిందట సామ్. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

8. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఈ బాలీవుడ్ మూవీ హిందీలో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాతో చాలామంది డెబ్యూ యాక్టర్స్ బాలీవుడ్ లో పరిచయం అయ్యారు. అలియా భట్, సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ఇదే సినిమాతో అరంగేట్రం చేసారు. ఎందుకు మిస్ చేసుకుందో తెలియదు. కానీ అదొక సూపర్ హిట్.

9. అశ్విన్ శరవనన్: గేమ్ ఓవర్ అనే సినిమా రూపొందించిన ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కోసం సమంతను అడిగారట. కానీ సామ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదట. అందుకే ఈ సినిమా కూడా మిస్ చేసుకుంది.

10. పుష్ప : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. మరి ఇలాంటి పాన్ ఇండియా సినిమాను సామ్ ఎలా వదులుకుందో అర్ధం కావట్లేదు. మొత్తానికి సామ్ నో చెప్పడంతో రష్మిక మందన రంగంలోకి దిగింది.

ఇలా మొత్తానికి సామ్ ఈ పది సినిమాలు వదులుకుంది. అందులో ఫ్లోప్స్ ఉన్నాయి. హిట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం సామ్ కాతువకుల రెండు కాదల్ అనే సినిమా చేస్తోంది. ఈ విధంగా సామ్ మిస్ చేసుకున్న సినిమాలు ఇవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *