28-wife-35-children

28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు ఈ వ్యక్తి 37 వ సారి వివాహం చేసుకున్నాడు..!

News

రాజులు డజన్ల కొద్దీ రాణులను వివాహం చేసుకోవడం గురించి కథలు విన్నాము, అయితే, 21 వ శతాబ్దంలో ఇలాంటి వివాహాల ఆలోచన వెర్రిగా అనిపిస్తుంది. కానీ 37 వ సారి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి కి మాత్రం కాదు. ఒక వృద్ధుడు తన 37 వ భార్య మెడలో తన 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు తాళి కడుతున్నాడు అనే పేరున ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 45 సెకన్ల క్లిప్‌ను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో “బ్రేవెస్ట్ మ్యాన్ ….. లివింగ్.

28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్ల ముందు 37 వ వివాహం” అనే క్యాప్షన్‌తో పోస్టు చేసాడు. వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందో తెలియదు. అది చూసిన ఒక వ్యక్తి, “ఏం అదృష్టం రా బాబు, ఇక్కడ ఒక్కరినే సరిగ్గా చూస్కోలేకపోతున్నాం” అని అన్నారు. మరొకరు “నాకు ఇప్పటివరకు ఒక్కసారి పెళ్లి చేసుకునేందుకే ఇంకా ధైర్యం రాలేదు,ఇతను 37 వ పెళ్లి ఎలా చేసుకున్నాడు?” అని రాసాడు. ఇంకొకరు “సింగిల్స్ ఇది చూసారో RIP అయిపోతారు” అని వ్యక్తపరిచారు.

ఇది ఇలా ఉంటే గతంలో, ఒక తైవానీస్ వ్యక్తి ఒకే మహిళను నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడు, 37 రోజుల వ్యవధిలో మూడుసార్లు విడాకులు తీసుకున్నాడు – ఇదంతా ఆఫీస్ నుండి సెలవు పొందటానికి.

తైపీలో పేరులేని బ్యాంక్ గుమస్తా గత ఏడాది ఏప్రిల్ 6 న వివాహం చేసుకున్నాడు మరియు అతని వివాహ సెలవు ముగిసిన తర్వాత, అతను తన భార్యను విడాకులు తీసుకున్నాడు మరియు మరుసటి రోజు మరో లీవ్ అడగడానికి ఆమెను వివాహం చేసుకున్నాడు, అతను చట్టం ప్రకారం ఇలా చేయడానికి తనకు అర్హత ఉందని భావించాడు.

అతను నాలుగుసార్లు వివాహం చేసుకుని మూడుసార్లు విడాకులు తీసుకునే వరకు అతను మొత్తం 32 రోజుల పాటు నాలుగు వివాహాలకు లీవ్ పొందగలిగాడు. అతను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాడో బ్యాంక్ గమనిస్తుంది అని తెలుసుకున్నాడు.

అతని మొదటి వివాహం కోసం 8 రోజులు మాత్రమే అతనికి సెలవు మంజూరు చేసింది బ్యాంక్ అందుకు తైపీ సిటీ లేబర్ బ్యూరోలో ఆ వ్యక్తి తాను పని చేస్తున్న బ్యాంకు పై ఫిర్యాదు చేసాడు .తరువాత, అక్టోబర్ 2020 లో బ్యాంకుకు NT $ 20,000 (రూ. 52,800) జరిమానా విధించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *