50-years-heroines

50 ఏళ్లకు దగ్గరవుతున్న కూడా ఇంకా పెళ్లి చేసుకోని స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

Trending

ప్రెజెంట్ జనరేషన్ లో ఆడవారైన మగవారైన 30 ఏళ్ళ వయసు వస్తేనే కానీ వారు వివాహం చేసుకోడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లైఫ్ లో బాగా సెటిలైతేనే కానీ పెళ్లి విషయం ఆలోచించకూడదు అప్పటివరకు పెళ్లి చేసుకోకూడదు అని చాలా మంది గట్టిగా ఫిక్సయిపోతున్నారు.అయితే ఇదిలా ఉండగా ఆడవారు 20 ఏళ్ళ వయసు చేరుకోగానే వారికి వెంటనే పెళ్లి చేసి పంపించెయ్యాలని ఇంట్లో ఉండే పెద్దవారు ఆశపడుతుంటారు. అయితే ఈ మధ్య చాలామంది అమ్మాయిలు బాగా చదివి, వారికి మంచి ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఏకంగా 30 ఏళ్ళ వరకూ పెళ్లిని స్కిప్ చేసేస్తున్నారు.

అయినప్పటికీ వారి ఇంటి పెద్దలు ఊరుకుంటారా అమ్మాయికి 30 మించనివ్వకుండ పెళ్లిళ్లు చేస్తున్నారు అనేది వాస్తవం. అయితే మరి హీరోయిన్ల సంగతి ఏంటి.? సాధారణ అమ్మాయిలలా కాదు కదా?. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటిస్తే చాలు వారు ఫేడౌట్ అయిపోయారు అని అంతా గట్టిగా ఫిక్సయిపోతుంటారు.కానీ ఎంతకాదనుకున్నా వారు కూడా 40 ఏళ్ళ లోపే పెళ్లిళ్లు చేసుకొని సెట్టిల్ అయిపోవాలని చూస్తుంటారు. అయితే కొంతమంది నటీమణులు మాత్రం వారికి 50 ఏళ్ల వయసుకు పైబడుతున్నప్పటికి ఇంకా పెళ్లి విషయం ఆలోచించడం లేదు.అయితే ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి .

1) నర్గీస్ ఫక్రీ :

ఈమె వయసు ఇప్పుడు 40 ఏళ్ళు. ఈ హీరోయిన్ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. అయితే ఈమెకు 40 ఏళ్ళు వచ్చిన కూడా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

2) వెన్నిరాడై నిర్మల :

‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ మూవీలో మెగాస్టార్ తల్లిగా నటించిన ఈమె. గతంలోను ఎన్నేనో మూవీస్ లో హీరోయిన్ గా కూడా నటించింది.ఇప్పుడు ఈమె వయసు 72 ఏళ్ళు.ఈమె తన జీవితంలో ఎదురుకున్న కొన్ని సమస్యల వల్ల పెళ్లి చేసుకోలేదట.

3) శోభన :

గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన మెగాస్టార్, బాలక్రిష్ణ మరియు నాగార్జున వంటి నటుల సరసన నటించిన ఈ హీరోయిన్ కి ఇప్పుడు 50 ఏళ్ల కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

 

4) సుష్మితా సేన్ :

ఈమె 44 ఏళ్ళ వయసొచ్చినా కూడా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.కానీ రొమన్ షాల్ అనే వ్యక్తితో గత రెండు సంవత్సరాలు గా సహజీవనం చేస్తుందట.

5) సితార :

హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.అయితే ఈమెకి 47ఏళ్ళ వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు.

6) అమీషా పటేల్ :

టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ లతో సినిమాల్లో నటించిన ఈమెకు ఇప్పుడు 44ఏళ్ళ అయిన ఈమె పెళ్లి చేసుకోలేదు.

7) నగ్మా :

తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటుగా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ నగ్మా వయసు కూడా 45 ఏళ్ళు. అయినా ఈమె ఎందుకో పెళ్లి చేసుకోలేదు.

8) టబు :

ఈమె కూడా ఒకప్పుడు టాలీవుడ్ లి స్టార్ హీరోయినే..! అయితే ఆమె కి 48 ఏళ్ళ వయసొచ్చినా కూడా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

9) ఆశ పారేఖ్ :

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా కెరీర్ ను మొదలుపెట్టి తరువాత ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈమె వయసు ఇప్పుడు 78 ఏళ్ళు. మరి ఎందుకో ఈమె కూడా అసలు పెళ్లి చేసుకోలేదు.

10) కౌసల్య :

‘అల్లుడుగారు వచ్చారు’ ‘పంచదార చిలక’ అనే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. అయితే ఈమెకి కూడా 40 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి అలోచనలు లేవంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *