abijeet

పాపులర్ అయి కూడా సినిమాలు చేయక పోడానికి కారణం ఇదే అని తెలియ చేసిన అభిజిత్

News

2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా మనకు పరిచయమైన హీరో అభిజిత్. బిగ్ బాస్ సీజన్ 4 లో విజేతగా నిలిచిన అభిజిత్ అతను గెలిచిన తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు ప్రజలలో ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనే ఆతురత రోజురోజుకు పెరుగుతోంది.

సీజన్ ఫోర్ లో అఖిల్ మోనల్ సోహెల్ మెహబూబ్ అందరు కూడా ఏ టాస్క్ ఇచ్చినా అందరు ఒక్కటై ఆడేవారు ఈ నాలుగు వర్సెస్ మిగితా హౌస్ మేట్స్ గా బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగింది ఇంతటి పోటీ మద్దెలో అభిజిత్ ఏ టాస్క్ అయిన సింగిల్ గా అడుతు తనదైన ప్రతిభను చూపించి ప్రజల ఆదరణ పొంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ అయిన తర్వాత ఈ సంవత్సరం కూడా సీజన్ 5 ద్వారా మనల్ని ఆనందింప జేయడానికి 19 మంది కంటెస్టెంట్ లతో బిగ్‏బాస్ 5 వ సీజన్ ప్రారంభం అయింది. ఈసారి కిందటి సీజన్ లాగా పోటీదారుల మధ్య అండర్ స్టాడింగ్ కంటే కూడా గొడవలు ఎక్కువుగా జరుగుతున్నట్టు చూస్తున్నాం వీరి ప్రవర్తన వల్ల ఈ సారి బిగ్ బస్ ఉత్కంఠగా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక చివరి సీజన్ బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ గా ఉండి గొప్ప ప్రజాదరణ పొందాడు. శేఖర్ కమ్ముల ద్వారా నిర్మితమైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా మనకు పరిచయమైన అభిజిత్ ప్రేక్షకుల ఆదరణ పొందుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించే ప్రేక్షకుల ఆదరణను రెట్టింపుగా పొందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ గెల్చుకున్న అభిజిత్ తనకు వచ్చిన క్రేజ్ ను సరిగా వినియోగించుకోవడం లేదని చాలామంది నెటిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

abijeet
abijeet

ఎంతో మంది అభిమానులు అభిజిత్ ను మరోసారి సినిమాలో చూడాలని ఎదురుచూస్తున్నారు కానీ అభిజిత్ బిగ్ బాస్ ఫోర్ గెలిచాక అసలు ఏ సినిమాలో కూడా కనిపించకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. బిగ్ బాస్ లో లో గెలిచిన తర్వాత మూడు స్క్రిప్ట్ ల గురించి ప్రస్తావన అభిజిత్ తెలియజేశాడు తాను మూడు స్క్రిప్టులను వినానని తెలియజేశారు.

కానీ వాటిలో ఏది ఫైనల్ చేశారో తెలియజేయలేదు. ఈ రకంగా ప్రజలలో ఉత్కంఠ నింపిన అభిజిత్ తాజాగా తన సోషల్ మీడియాలో లైవ్ వీడియో లో మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలియజేశాడు తనకు తన ఆరోగ్యమే ప్రాధాన్యమని కూడా అన్నాడు. ఇదే విషయాన్ని చాలాసార్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు ఈ అంశం చాలా రోజుల నుండి హాట్ టాపిక్ గానే ఉంటుంది. త్వరలో అభిజిత్ ను సినిమాల్లో చూడబోతున్నాము అని ప్రేక్షకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *