actor-pavithra-nadh

Actor Pavithra Nadh పేరేమో పవిత్ర పనులేమో అపవిత్ర, ఎప్పుడు రగిలిపోయేవాడు

News

Actor Pavithra Nadh: పేరేమో పవిత్ర పనులేమో అపవిత్ర, ఎప్పుడు కామంతో రగిలిపోయేవాడు, 11 యేండ్లు గా నాకు నరకం చూపించాడు. అని పోలీస్ లను ఆశ్రయించింది.

ఒక సమయం లో జెమినీ టీవీ లో ప్రభంజనం సృష్టించిన సీరియల్ మొగలి రేకులు, ఇప్పుడు ప్రస్తుతం ఈ సీరియల్ ప్రసారం అవ్వకపోయినా ఆ సీరియల్ లోని యాక్టర్ల పేర్లు ఇంక ఎంతో మందికి జ్ఞాపకం ఉండే ఉంటాయి, నటుల వర్జినల్ పేర్ల కంటే సీరియల్ లోని పాత్రల పేర్ల తోనే గుర్తుండి పోయారు ప్రజలకు.

ఇక ఆ సీరియల్ లో ముఖ్యమైన కొన్ని పాత్రలలో దయ ఒకటి ,
వాస్తవ జీవితం లో అయన పేరు పవిత్ర నాథ్. అయితే తాజాగా ఈ పవిత్ర నాథ్ వరుస చర్చల్లో నిలుస్తున్నాడు.

ఆయన భార్య అయన పై చేసిన ఆరోపణలు లోకమంతా కోడై కూస్తున్నాయి. పవిత్ర నాథ్ శశికళ ను 2009 లో వివాహం చేసుకున్నారు , ఇప్పుడు వారికీ 11 యేండ్ల పాప 8 యేండ్ల బాబు ఉన్నారు. వృత్తి పరంగా నటుడైనప్పటికీ జాతకాలు చూడటం అనే సైడే బిజినెస్ కూడా చేసే వాడు ముఖ్యంగా అమ్మాయిల జాతకాలు ఎక్కువ చూసే వాడు అని అయన భార్య వాపోయింది.

శశికళ పవిత్రది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే పెళ్లైన 3 రోజుల్లోనే పవిత్ర అసలు ప్రవర్తన బయట పడింది, రాత్రుళ్ళు 2 అయిన అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడే వాడు, అదే గాక జాతకం పేరుతో అమ్మాయిలను బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళి తలుపులు వేసుకొని కొన్ని గంటల పాటు గడుపుతాడు. ఏంటిది అని ప్రశ్నించిన తన భార్యను గర్భవతి అని తెలిసి ఆమెను ఇంట్లో నుండి వెలివేశాడు.

actor-pavithra-nadh

అయన భార్య తన భాదను ఇలా చెప్పుకొచ్చింది పెళ్లయిన కొంతకాలానికి తాను పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించడం అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నడని తెలిసింది. పెళ్లి తర్వాత ఆ అమ్మాయి తోని మళ్ళీ కంటిన్యూ అవుతుంటే నేను మా అత్త మామకు చెప్పగా. నాకు సపోర్ట్ ఇవ్వక ఏదో సింపుల్ మేటర్ గా కొట్టిపారేశారు . అయితే 2012లో పోలీసులను ఆశ్రయించి నా భర్త పైన కేసు పెట్టాను అప్పుడు నా అత్తమామలు భర్త కలిసి ఇంట్లో నుండి నన్ను తరిమేశారు పైగా నా పైన రివర్స్ కేసు పెట్టారు.

అయితే ఒక సందర్భంలో ఇల్లు కొనాలనుకున్నాం అందుకోసం నగలన్నీ అమ్మి ఇకనైనా మారతాడేమో మా గురించి ఆలోచిస్తాడేమో అని ఇచ్చాను మణికొండ లో ఒక ఇల్లు కూడా కొన్నాము కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇంకా చాలా సార్లు గొడవపడ్డ ప్రవర్తన మార్చుకోమని కని మారక కొన్ని నెలల పాటు ఇంటికి రాకుండా ఉండేవాడు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవడడు ఏదైనా పవిత్ర గురించి తెలుసుకోవాలంటే పవిత్ర ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చేది, పిల్లలను ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇంతవరకు ఒక్క సీటు ముక్క కూడా వారి కోసం తేలేదు, ఎప్పుడైనా పిల్లల బర్త్ డే వస్తే రెండు గంటలపాటు వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతాడు,

విడాకుల కోసం ఎంతో ప్రయత్నం చేశాను గాని నా భర్త దానికొరకు అంగీకరించలేదు, నా భర్త నుండి వెళ్ళిపోలేక ఆయన మమ్మల్ని పోషించక, కుటుంబ బాధ్యత అంతా నా పైన పడి పిల్లలిద్దర్నీ పోషించడానికి రెండు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది, పిల్లలు ఇద్దరిని తమ తండ్రికి దూరంగా పెట్టి పెంచుతున్నాను.

నా కోరిక ఏంటంటే మాకు చెరోక ఇండ్లు ఉన్నాయి, ఆ రెండు అమ్మేసి పిల్లల పేరు పైన ఫిక్స్ డిపాజిట్ చేయాలని ఓకే డిమాండ్ ఉంది.
ఇక ఇదంతా శశికళ సైడ్ వాదన అయితే వాస్తవానికి ఎంత మటుకు సత్యం పవిత్ర వెర్షన్ ఏంటో, శశికళన్ను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *