ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఓంకార్ హోస్ట్ అనగానే ఆ షో కి ఎంతగానో హైప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఓంకార్ షోస్ ఎప్పుడు కూడా సెన్సేషన్ అవుతూనే ఉంటాయి. అలాగే అతని ట్రేడ్ మార్క్ పదం “వన్ సెకండ్” ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ 4వ సీసన్ కూడా అలానే ఆసక్తికరంగా ఉండడానికి ఎన్నో ప్రణాళికలు ఓంకార్ ముందే చేసుకొని షో ను సక్సెసఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఆలా ఈ షో ద్వారా ఎంతోమంది ప్రముఖులను వారి పర్సనల్ లైఫ్ విషయాలను మన ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ షో యొక్క 14వ ఎపిసోడ్ లో పాల్గొనడానికి సీనియర్ హీరోయిన్ రాశి తో పాటుగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు ఆడియన్సు కి పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకున్న కస్తూరి గారు కూడా పాల్గొన్నారు. ఆ షో లో ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు కస్తూరి గారు.
తన జీవితంలో ఎదురైనా బాధలను పంచుకున్నారు. తన కూతురిని రియల్ హీరో అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ సరి ఓంకార్ కూడా ఆమె స్టోరీ విన్నాక ఎమోషనల్ అయ్యాడు. తన కూతురు 3 సంవత్సరాలు లుకేమియా వ్యాధి తో పోరాడిందని చెప్పింది. ఆ మూడు సంవత్సరాలు ఆమె హాస్పిటల్ బెడ్ పైనే ఉందని అయితే ఆమె ఏ రోజు కూడా ఏడవడం గాని బాధ పాడడం గాని నేను చులేదు అని ఆమె అన్నారు.
ఆమె చనిపోతుంది అనుకున్న నేను ఆమెని చూసి ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదురుకోవాలని నార్చుకున్న అని ఆమె అన్నారు.అంతే కాదు ఇప్పుడు కస్తూరి తన కూతురి పేరు పైన ఒక ఛారిటీని ఓపెన్ చేసి ఎంతో మంది డబ్బులు లేక కాన్సర్ చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న వారికి చికిత్స కోసం డబ్బు కూడబెట్టి ఆ చారిటీ ద్వారా వారికి వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. అంతే కాదు ఆమె ఆ షో ద్వారా వచ్చిన డబ్బును కూడా చారిటీ కి చేస్తానని చేప్పారు. దాంతో ఓంకార్ ఎమోషనల్ అయిపోయి చప్పట్లు కొట్టాడు.
రోజువారీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మితో తెలుగు టెలి ప్రేక్షకులకు దగ్గరైన నటి కస్తూరి శంకర్ వివిధ సమస్యలపై తన అభిప్రాయాల గురించి ఎప్పుడూ గొంతు విప్పుతుంటారు.బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నటులు దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ఇతరులపై ఎన్‌సిబి చేస్తున్న దర్యాప్తుపై ఆమె ఇటీవల ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆమె ఇలా ట్వీట్ చేసింది: “బాలీవుడ్ డ్రగ్ ఇన్వెస్టిగేషన్స్: దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోనే ఖంబట్టా ….
కాబట్టి ప్రాథమికంగా మహిళా నటులను మాత్రమే ప్రశ్నిస్తారా? ఒక్క మగ నటుడు లేదా దర్శకుడు మీరు జరుపుతున్నఈ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు లేరు? అంటూ ఆమె ప్రశ్నించారు.చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన కస్తూరి, తాను కూడా ఒకసారి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విచారణలో బయటపడిన మాదకద్రవ్యాల సంబంధిత కేసులో ప్రశ్నించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బాలీవుడ్ నటులు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్‌లను పిలిచినట్లు సమాచారం. టైమ్స్ నౌ ప్రకారం, నలుగురు పురుష నటులు కూడా ఎన్‌సిబి స్కానర్‌లో ఉన్నారు.