Actress Kavitha

అవకాశాల కోసం ఎదురు చూసి.. కనుమరుగై పోయినా ఒకప్పటి కథానాయకి.

News

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ కి తమదైన గుర్తింపు ఉంది. నటుడిగా మరియు రచయితగా సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న వీరు సుమారు అర్థ శతక కాలం నుండి సినీ పరిశ్రమకు సేవలు అందిస్తూనే ఉన్నారు.

పరుచూరి బ్రదర్స్ లో తెర మీద కంటే తెర వెనుక ఉండి ప్రసిద్ధి చెందిన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గతకాల అనుభవాలను పంచుకుంటూ అలనాటి నటి ప్రస్తుత బీజేపీ నేత కవిత గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మా బ్రదర్స్ ఇద్దరం సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందే కవిత గారు కథానాయకిగా 1976 నుండి 1984 వరకు ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు, అయితే మేము 1978లో చలిచీమలు సినిమాతో ఎంట్రీ ఇచ్చాము కానీ అప్పటికి మేము ఎవరిని మా సినిమాలో పెట్టుకోవాలో నిర్ణయించే అంత గొప్ప స్థాయిలో లేము అలా సుమారు 1982 వరకు ఆ స్థాయిని సంపాదించుకోలేదు. 1984 తర్వాత వేరొకరిని రికమెండ్ చేసే అవకాశం నాకు లభించింది, మాకు ఎదురైన ఇలాంటి పరిస్థితి సాధారణంగా సినీ పరిశ్రమలో ఎదుగుతున్న ప్రతివాడు ఎదుర్కొని తీరాల్సిందే. పేరున్న దర్శకులు రచయితలు ఆ ఆర్టిస్టు ను తీసుకో ఈ ఆర్టిస్ట్ ను తీసుకో అని మన పై ఒత్తిడి పెంచుతారు తప్ప మన అవసరాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు.

ఇక కవిత నటించిన పెళ్ళిళ్ళ పేరయ్య సినిమా కి నేను పని చేశాను, కవిత గారు మనసుపెట్టి నటించినప్పటికీ ఆ చిత్రం అంత బాగా ఆడలేదు. ఆ తర్వాత మేము చేసిన సినిమా అల్లరి పిడుగు లో కూడా నటించింది. అయితే ఆమె మేము రాసిన చిత్రాలకంటే వేరే చిత్రాలలో మంచి ప్రదర్శన ఇచ్చి పేరు సంపాదించుకుంది,

ఆ తర్వాత ఆమె నటించిన ప్రెసిడెంట్ పేరమ్మ గొప్ప విజయం సాధించింది నేను ఈ సినిమాను ఒక రచయిత కంటే ఒక ప్రేక్షకుడిగా చూసి సంతోషపడ్డాను అన్నారు.

అయితే సినిమా పరిశ్రమలో ఉన్న అవలక్షణం తో నటుడిగాని న్నటి గాని సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా సరిగా ఆడకపోతే ఆ వ్యక్తిని తీసేస్తూ ఉంటారు 1883-84 సమయంలో ఇలాంటివి విపరీతంగా జరిగేవి, అందుకే ఎదుగుతున్న వాళ్ళు ఎదుగుతూ ఉండేవారు కొద్దో గొప్ప సినిమాలు చేసిన వాళ్లు దిగజారుతూ ఉండేవారు . ఈ రకంగా ఎదిగిన వారే రాధా సుహాసిని విజయశాంతి భానుప్రియ ఈ నలుగురైదుగురు తప్ప వేరే వారికి ఎక్కువ అవకాశాలు వచ్చేవి కాదు, అందుకే మన కవిత గారు అవకాశాలు లేక ఆమె ఒకప్పుడు హీరోయినా అని నమ్మలేక ప్రశ్నించుకునే స్థాయికి ఆమె వెళ్ళిపోయింది.

ప్రెసిడెంట్ పేరమ్మ లో కవిత గారు గొప్ప నటించినప్పటికీ ఇంకా కొన్ని గొప్ప అంశాలను ఆమె కోసం ఎందుకు వ్రాయలేక పోయాను అన్న బాధ ఎప్పటికీ కలుగుతుంది అన్నారు, ఆ తర్వాత కొంత కాలానికి వచ్చిన అమ్మ రాజీనామా సినిమాలో అప్పటికే పేరున్న సీనియర్ నటి శారద తో పోటాపోటీగా, తనలో నటన ఎంత దాగుందో ఆ సినిమాలో ప్రదర్శించింది.

Actress Kavitha

కవిత మా కుటుంబానికి సన్నిహితురాలు మేము షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు అశోక హోటల్ లో ఉండేవాళ్ళం కవిత ఎప్పుడూ మా ఎదురు రూమ్ లోనే ఉండేది, అయితే ఎప్పుడైనా మాకు సినిమాలో నటించే నటుల లిస్టు అందినప్పుడు కవిత ఎదురు రూం లో ఉన్నా నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకోవడం లేదు నేను హీరోయిన్ గా కనిపించడం లేదా అని అంటూ ఉండేవారు, అయితే ఎన్నడూ కూడా తనకు పాత్ర ఇవ్వలేదని గొడవ పడలేదు ఎప్పుడు కలిసినా ప్రేమతో పలకరించేది అని ఆయన అన్నారు,

ఆమె చిత్రసీమలో ఉన్నన్నాళ్ళు ఒక్క అవకాశం వస్తే చాలు నా సత్తా చూపించుకుంటాను అని చాలా ఎదురు చూసింది కానీ సరైన అవకాశాలు లేక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి దేశానికి సేవ చేయడానికి బిజెపి పార్టీలో చేరింది, ఆమెకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చి ప్రజలకు సేవచేసే భాగ్యం ఇస్తే నేను సంతోషిస్తాను అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.