actress-pragathi

అమ్మాయిలు అందంగా కనిపిస్తే వదలదు క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు

Trending

సీనియర్ నటి ప్రగతి ఒక్కపుడు తన కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించారు కని తను నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అవుతు వచ్చాయి దాంతో సినిమాల నుండి పూర్తిగా విరమించుకుని వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్న కొంతకాలానికి తమ మధ్య మనస్పర్ధలు విభేదాల వల్ల ప్రస్తుతం ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా కాలానికి మళ్ళీ నటన ప్రారంభించి ప్రస్తుతం అక్క వదిన చెల్లి అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ప్రగతి గారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గత అనుభవాలను పంచుకున్నారు, తాను 20 ఏళ్లకే వివాహం చేసుకుని తప్పు చేశానని ఆ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల జీవితమంటే సరిగా అవగాహన కాలేదని అందువల్ల ఆ జీవితాన్ని సరిగా లీడ్ చేయలేక పోయానని, తన పెళ్లి సినిమా జీవితం పైన ప్రభావం చూపించిందని అందువల్లే సినిమాలో సరిగా రాణించలేకపోయారు అని అన్నారు.

actress-pragathi

అదే సమయంలో ఒక సినిమా షూటింగ్ విషయంలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెబుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప పేరు కలిగిన ఒక కమెడియన్ తనతో మాట్లాడాలని పిలిచి తన కామవాంఛను తీర్చమని వేధించాడు అని చెప్పింది, ఆ వ్యక్తిని వదిలించుకోవడానికి చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చానని ఆ తర్వాత మళ్లీ ఆ కమెడియన్ తన జోలికి రాలేదని చెప్పింది.

అయితే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక ప్రతి రకమైనటువంటి పరిశ్రమలో ఉంది అయితే కాస్టింగ్ కౌచ్ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుంది అని తెలియజేసింది.

ఇక ప్రస్తుతం నటి ప్రగతి తెలుగులో ఐదు కు పైగా చిత్రాలలో ప్రాధాన్యం కలిగినటువంటి పాత్రలను పోషిస్తున్నారు, తాజాగా రిలీజ్ అయినటువంటి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రను పోషించి అలరించారు.

ఇదేగాక ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బరువు తగ్గడానికి చిట్కాలు చెప్తూ ప్రేక్షకులతో ఎల్లప్పుడూ సమీపంగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.