ఇంత కాలంగా హీరోగా చూసిన బాలయ్యను త్వరలో ఒక టాక్ షో కి హోస్ట్ గా చూడబోతున్నాం, బాలకృష్ణ గారి మేనరిజం మనకు తెలిసిందే ఇక తన మేనరిజంతో షో ఎలా చేయబోతున్నారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
అయితే ఈ షో తాజాగా ఈవెంట్ జరుపుకో గా ముఖ్యమైన సిని ప్రముఖులు హాజరయ్యారు, అందరూ ఈ షో పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు , ఇక అల్లు అరవింద్ కూల్ గా మాట్లాడుతూ బాలకృష్ణ కేవలము స్క్రీన్ పైన నటుడని నిజ జీవితంలో నటించడం చేతకాదు అని అన్నారు. ఆయన తనలో ఏ ఫీలింగ్ దాచుకోకుండా లోపల ఒక మాట బయటకు మాట కాకుండా అందరితో యదార్ధంగా ఉండే మనస్తత్వం బాలకృష్ణది , కోపం వస్తే కోప్పడ్డం సంతోషం వస్తే సంతోషించడం , తన మనసులోపల బయట ఒకేమాదిరిగా నడుచుకుంటాడు బాలకృష్ణ అన్నారు అల్లు అరవింద్.
ఇక ఇలాంటి యధార్ధమైనటువంటి వ్యక్తి తో నిర్మిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. విత్ ఎన్.బి.కె. లో ఎలాంటి మిక్సెడ్ ఫీలింగ్స్ ఉండబోతున్నాయో ఆలోచించండి. నేను మొదట బాలకృష్ణ గారితో ఒక టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందని ఆహా వారితో అన్నాను దానికి ప్రతి ఒక్కరూ స్పందించి ఆయన ఒప్పుకుంటే ఈ షో కచ్చితంగా హిట్ అవుతుందని , అందరూ ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ఈలలు వేశారని అన్నారు.
ఇక అందరి మనసులో మాట విన్న తర్వాత నాకు బాలకృష్ణ కు ఫోన్ చేయాలి అనిపించింది ఫోన్ చేసి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే మరో క్షణం ఆలోచించకుండా బాలకృష్ణ గారు ఒప్పేసుకున్నారు.
బాలకృష్ణ గారికి తన వృత్తి పట్ల ఎవరు చెప్పిన వినయం కలిగి ఉండే లక్షణం ఉన్నది కనుకనే ఆయన ఈ షో కి పూర్తి మద్దతు ఇచ్చారని అల్లు అరవింద్ అన్నారు. ప్రస్తుతం 15 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఆహా ఈ విధమైనటువంటి షోలను ప్రోత్సహించి 20 లక్షల సబ్‌స్క్రైబర్స్ కు చేరుకుంటుంది ధీమా వ్యక్తం చేశారు.