Allu arjun about telugu actors

ఇంకా అమ్మాయిలు రావాలంటూ… అమ్మాయిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్.

News

తాజాగా జరిగిన వరుడు కావలెను ప్రియ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ అమ్మాయిల గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. సితార బ్యానర్పై నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా నాగ శౌర్య రీతు వర్మ లు నటిస్తున్న వరుడు కావలెను సినిమా త్వరలో విడుదల అవ్వ్వబోతుండగ. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది . ఆ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడాయి, థియేటర్లలో ఆంక్షలు తొలగి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు, దేశవ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేని థియేటర్లను చూస్తున్నాము , ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను అని అన్నారు.

నాగ శౌర్య గురించి మాట్లాడుతూ అసలు ఏ నేపథ్యం లేని హీరోలలో ఒకడు నాగ శౌర్య , తన అమాయకత్వం మరియు మంచితనంతో పరిశ్రమలో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నాడు. అలాగే పెళ్లి చూపులు సినిమా చూసిన వెంటనే రీతూ వర్మ గురించి తెలుసుకున్నాను, ఈ అమ్మాయి ఈ సినిమాలో చాలా బాగుంది అంటూ, ఈ సినిమాకు ఒక అమ్మాయి దర్శకత్వం వహించడం నన్ను సంతోష పరిచింది ఇలాగే ఎంతో మంది అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకొని సినీ పరిశ్రమకు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు, ముంబైలో సినిమా షూటింగ్ చేసేటప్పుడు షూటింగ్ లోకేషన్ లో 50% అమ్మాయిలు కనబడినట్టు మన పరిశ్రమలు కూడా అమ్మాయిలు ఎక్కువగా పని చేయడానికి రావాలి అని ఆయన అన్నారు. ఇక మా సంస్థలుగా అనిపించే హారిక హాసిని సితార సంస్థలు ఈ సీజన్ లో వరుస విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు, అలాగే ఈ సంవత్సరం ముగిసేసరికి పుష్ప తో మీ ముందుకు వస్తున్నాను ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఆ తర్వాత త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ సినిమా చూశాక కచ్చితంగా మనతో కొన్ని జ్ఞాపకాలు తీసుకొని పోతాము , ఈ సినిమా మనకు తెలిసిన అమ్మాయి కథలాగా అనిపిస్తున్నట్లు ఉంటుంది, రీతు వర్మకు పెళ్లి జరిగే అంశంపైన తెరకెక్కుతున్న ఈ కథ లో నాగ శౌర్య మంచి నటనను ప్రదర్శించాడు క్లైమాక్స్ మరియు ఇంటర్వెల్ సీన్ అయితే అదరగొట్టేశాడు అన్నారు. ఎంతోకాలం తర్వాత ఒక హీరోయిన్ చీరకట్టులో కనిపించబోతుంది అన్నారు.

Allu arjun about telugu actors

నాగశౌర్య మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వేడుకలో ఇంతమందిని చూసింది లేదని ఇక్కడికి వచ్చిన వారందరని చూస్తే చాలా సంతోషం వేస్తుందన్నారు, ఈ చిత్ర డైరెక్టర్ సౌజన్య పదిహేనేళ్లుగా కష్టపడింది, ఈ సినిమాతో తను కచ్చితంగా విజయం సాధిస్తుంది అని అన్నారు, ఇక అల్లు అర్జున్ గారు మా తరానికి ఒక స్ఫూర్తి గా ఉన్నారు అలాంటి వ్యక్తి మా సినిమా వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
అలాగే ఈ నెల 29 విడుదల కాబోతున్న పూరి జగన్నాథ్ కుమారుడు నటించిన రొమాంటిక్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆకాష్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ కలిసి గెలుద్దాం అన్నాడు.

ఇక సినిమా హీరోయిన్ రీతూ వర్మ మైక్ అందుకొని నా తొలి సినిమా నుండి అల్లు అర్జున్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఆయనతో కలిసి పనిచేయాలనీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.

చివరగా చిత్ర డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ తనతో మళ్లీమళ్లీ సినిమా చేయాలనిపించే హీరో నాగ సౌర్య అని అలాగే మనిషికి మాటకు విలువ నిచ్చే వ్యక్తి నిర్మాత చిన్న బాబు గారు అని అన్నారు. అలాగే ఈ వేడుకకు హాజరైన నదియా తమన్ విశాల్ ప్రవీణ్ శరత్ ఇంకా మరికొంత మంది ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *