అల్లు అర్జున్: సల్మాన్ ఖాన్ ను అందుకే కలిశాడట!

Movie News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బిగ్ బాస్ కార్యక్రమంలో కనిపించబోతున్నాడు. అయితే అది మన తెలుగు బిగ్ బాస్ మాత్రం కానేకాదు . టాలీవుడ్ లో మంచి సినిమాలు అందిస్తూ టాప్ స్పీడ్ తో దూసుకెళ్లే అల్లుఅర్జున్ తాజాగా పుష్పా సినిమా లో నటిస్తు మరింత బిజీ గా ఉంటున్నారు. ఇక తాజాగా అందిన వార్త ప్రకారం తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 15 లో కనిపించబోతున్నారు.

వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీ లలో ఎలాంటి పాత్ర కలిగినవాడో మనకందరికీ బాగా తెలుసు.

అల్లు అర్జున్ మేనరిజం , స్టైల్ మరియు డాన్స్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సినిమాల్లో కూడా తన నటనా ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమానుల దృష్టిలో అల్లుఅర్జున్ ఎప్పుడు ఒక కొత్త ట్రెండింగ్ క్యారెక్టర్ లాగానే కనిపిస్తూ ఉంటాడు.

ఇక ఈ సెగ ఉత్తర భారత అభిమానులకు కూడా తగిలింది. గత కొంత కాలం నుండి దక్షిణ భారత సినిమాలు హిందీలో అనువాదం చేయగా అవి చూసిన ఉత్తరభారతీయులు దక్షిణ భారత సినిమాలపై అభిమానాన్ని పెంచుకున్నారు , అలాగే కొంతమంది నటులకు అభిమానులుగా కూడా మారారు.

ఫేవరెట్ కామెడీయన్ బ్రహ్మానందం అయితే ఫేవరెట్ హీరో అభిమానికి ఒకరు ఉన్నారు. ఉత్తర భారతీయులు అభిమానించే హీరోలలో కచ్చితంగా అల్లుఅర్జున్ పేరు ఉంటుంది . హిందీ ప్రేక్షకులు అల్లు అర్జున్ ను అభిమానించేది అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనపై హిందీలో పాటలు రాసి విడుదల చేసినంత అభిమానం అల్లుఅర్జున్ పైన కురిపిస్తున్నారు. తాజాగా దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్ సాంగ్ ను సల్మాన్ ఖాన్ తన చిత్రంలో వాడుకో గా ఒరిజినల్ పాటను ఎంతోమంది అన్వేషించారు . దాంతో అల్లు అర్జున్ స్టెప్పులు సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులు కంటే అందంగా ఉండటంతో అల్లు అర్జున్ ని అభిమానించే వారి సంఖ్య పెరిగింది.

ఈ విధంగా హిందీ లో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఫ్యాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన అల్లు అర్జున్ బిగ్ బాస్ ప్రోగ్రాం లో ఎందుకు కనబడ బోతున్నారు అంటే, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప సినిమా భారీ అంచనాలతో భారతదేశంలోని అన్ని ప్రధానమైన భాషల్లో ఒకే రోజున రిలీజ్ కానుంది.

కాగా ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్లో ఉండబోతుంది కనుక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బృందం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు, ఇక హిందీలో సినిమాను ప్రమోట్ చేసేందుకు స్వయానా అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు, అందు కొరకు ఆయన ముంబై వెళ్లి సల్మాన్ ఖాన్ పోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ కార్యక్రమంలో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హిందీ లో ఒక మల్టీ స్టారర్ సినిమా షాహిద్ కపూర్ కాంబినేషన్లో చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *