allu-arjun

వారిని చూసి స్ఫూర్తి పొందిన అల్లు అర్జున్, ఇకనుండి తనలో మార్పుని చూస్తారు అంటోన్న బన్నీ

Trending

ఇటీవల కాలములో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ నెల పదిహేడో తారీఖున రిలీజ్ అవ్వబోయే పుష్ప 1 సినిమా కోసం ప్రమోషన్ లో చాలా బిజీగా ఉంటున్నారు అల్లు అర్జున్. ఇందులో భాగంగా ఈటీవీలో ప్రసారం అయ్యే “ఢీ” షోకి ముఖ్య అతిధిగా విచ్చేసి చాలా సందడి చేశారు బన్నీ.

 సుకుమార్ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా తీర్చిదిద్దారు. ఈ సంధర్భంగా అందులో పాల్గొన్న వారి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయాడు ఈ స్టైలిస్ స్టార్. వారి డ్యాన్స్ చూసి తాను చాలా మోటివేట్ అయినట్టుగా తన మనసులో మాట బయట పెట్టారు. అంతేకాకుండా తాను సినిమా రంగములో ప్రవేశించి దాదాపు 15 సంవత్సరాలు అవుతోందని, అందువల్ల తాను ప్రస్తుతం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని అంటూనే, ఇకపై రాబోయే రోజుల్లో తనలో కొత్త బన్నీని చూస్తారని అన్నాడు. ఇంత చిన్న వయస్సులో ఉన్న వీరి డ్యాన్స్ ను చూసి తాను ఖచ్చితంగా అప్ డేట్ అవుతానని తన నిర్ణయాన్ని అప్పటికప్పుడే ప్రకటించాడు అల్లు అర్జున్.

ఇన్నేళ్ల తన సినిమా ప్రయాణములో తన ప్రతీ సినిమాకి ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నానని చెబుతూ, డ్యాన్స్ విషయములో మరింత కష్ట పడాలనుకుంటున్నట్టుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన కెరీర్ లో ఈ స్తాయికి రావడానికి తాను ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ ఎంతో ఉపయోగపడిందని ఎమోషనల్ గా అన్నారు. తాను వయసులో కాస్తంత పెద్ద వాడిని అయినా, ఇప్పటి యూత్ చేసే డ్యాన్స్ చూస్తుంటే, ఇంకా తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని కామెంట్ చేశారు బన్నీ. ఈ సంధర్భంగా తనకి డ్యాన్స్ లో పలు మూవ్ మెంట్స్ నేర్పించిన పలువురి కొరియోగ్రాఫర్స్ కి కృతజ్ఞలు తెలియజేశారు ఈ ఐకాన్ స్టార్.

allu-arjun

అయితే పుష్ప సినిమా మొదటి భాగం ఈ నెల పదిహేడున రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతున్నా, రెండో భాగం మాత్రం చూడాలంటే వచ్చే వేసవి సీజన్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 2022 మే నెలలో ఈ సినిమా రెండో భాగం రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.