అంబికా బాలన్ చిన్ననాటి నుండి గాయకురాలు కావాలన్న తన కలను వెంటాడింది, ఆమె ఎన్నో సినిమాలల్లో కోరస్ లు పాడింది, హోటల్స్ లో పాడింది అంతే కాకుండా ఆమె సొంతం ఆర్కెస్ట్రా లో కూడా పాడేది.
కానీ కోవిడ్ -19 తన జీవితానంత అతలాకుతలం చేసేసింది. ఈ రోజు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి, అంబికా బాలన్, తన బైక్ మీద చెన్నై చీకటి వీధుల గుండా తిరుగుతూ, వినియోగదారులకు ఆహారాన్ని డెలివరీ చేస్తూ, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. “నా చిన్నతనంలోనే సంగీతంలో కఠినమైన శిక్షణ పొందాను.
అమ్మప్పెట్టి కృష్ణమూర్తి నా గురువు ”అని 34 ఏళ్ల అంబికా చెప్పారు, ఇప్పుడు రాపిడోతో కలిసి ఫుడ్ డెలివరీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. “19 ఏళ్ళ వయసులో, నేను తేలికపాటి సంగీతంతో పాడటం మొదలుపెట్టాను మరియు సినిమాలకు కోరస్ కూడా ఇచ్చాను.” బి కామ్ గ్రాడ్యుయేట్ అయిన అంబికా, ఏడు సంవత్సరాల క్రితం తన సొంత ఆర్కెస్ట్రా అయిన, అవంతిక ఆర్కెస్ట్రేషన్‌ను ప్రారంభించింది.
“నేను తమిళం, హిందీ, మలయాళం, మరియు తెలుగు పాటలు అలవోకగా పాడుతుంటాను, కాబట్టి నన్ను వివాహాలు, పార్టీలలో ప్రదర్శించడానికి మరియు స్టేజ్ షోలు చేయడానికి చాలా మంది పిలిచేవారు” అని ఆమె చెప్పింది. రెండేళ్ల క్రితం వితంతువు అయిన అంబికాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అవంతిక కు 8 సంవత్సరాలు మరియు రెండవ కుమార్తె శాంభవి కి రెండు సంవత్సరాల వయస్సు. “నా ఆదాయానికి అనుబంధంగా హోటల్ రమడా వంటి వివిధ హోటళ్లలో నేను ప్రదర్శన ఇచ్చాను” అని అంబికా చెప్పారు, అప్పుడు నెలకు 20,000 డాలర్లు సంపాదించేది. గత సంవత్సరం కరోనా మహమ్మారి యొక్క మొదటి వేవ్ ప్రారంభం అయినప్పుడు, పని ఆగిపోయింది. “నేను చెన్నై కార్పొరేషన్‌లో మూడు నెలలు సూపర్‌వైజర్‌గా పనిచేశాను” అని ఆమె చెప్పింది. ఒప్పందం ముగిసిన తరువాత, ఆమె బైక్ టాక్సీ కంపెనీలో పనిచేయడం ప్రారంభించింది.
“నేను కాలేజీలో ఉన్నప్పుడు నాన్న స్కూటర్ ను డ్రైవ్ చేసేదాన్ని. పగటిపూట నా కుమార్తెలను నేను చూసుకునేలా నేను సాయంత్రం షిఫ్ట్ చేసేదాన్ని, ”అని అంబికా చెప్పారు. “కానీ త్వరలో అది కూడా ఆగిపోయింది.” రెండు వారాల కిందట, రాపిడోలో ఆమెకు అవకాశం వచ్చినప్పుడు, ఆమె ఆ పనిని చేపట్టింది. “నేను సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు పని చేస్తాను. లాక్డౌన్ సమయంలో వీధులు ఎడారిగా కొన్నిసార్లు భయానకంగా ఉంటాయి. మరియు కొన్నిసార్లు అడ్రస్ కనుగొనడం కష్టం అవుతుంది. కానీ నా కుమార్తెల గురించి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను, ”అని అంబికా చెప్పింది,
కరోనా వైరస్ బారిన పడతాననే భయాన్ని అధిగమించడం ఆమె నేర్చుకుంది. “నేను గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా పనిచేశాను. నేను మాస్క్ మరియు చేతి తొడుగులు ధరిస్తాను, ఎల్లప్పుడూ నా హాండ్ బాగ్ లో శానిటైజర్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ప్రజలు మాస్క్ ధరించలేదని నేను గమనిస్తే, నేను వారిని మందలిస్తాను. ” అని ఆమె చెప్పారు. ఏదో ఒక రోజు మళ్ళీ పాటలు పాడే వృత్తికి తిరిగి చేరుకుంటాను అని ఆమె భావిస్తోంది. “నా లాంటి సంగీతకారులు చాలా మంది కష్టపడుతున్నారు. వారందరికీ సహాయం కావాలి, ” అని ఆమె చెప్పింది. “నేను కూడా పాడటం కొనసాగించాలనుకుంటున్నాను, కానీ ప్రస్తుతానికి, నా కుటుంబాన్ని పోషించడానికి నేను చేయవలసినది చేస్తాను.” అని మీడియా తో అన్నారు.