కరోన వైరస్ కు విరుగుడుగా ఎంతో మంది రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు కానీ ఏవి కూడా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు అంత పాపులర్ అవ్వలేకపోయాయి. ప్రజలు ఎంతగానో అతని మందును నమ్మడం మరియు అధరించడం మొదలు పెట్టారు.
అతని ఆయుర్వేద మందు కరోనాను నిజంగా నయం చేస్తుందో లేదో కచ్చితంగా తెలీదు కానీ, ఆ మందు పూర్తిగా సురక్షితం అని అంతే కాకుండా కరోనా వైరస్ ను ఎదురించేందుకు రోగనిరోధక శక్తిని కూడా ఈ మందు పెంచుతుంది అని ప్రభుత్వమే ఈ మందు అమ్ముకునేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా ఆ ముందుకు కావలిసిన ముడి సరుకు కూడా అందిస్తున్నారు.విజయవాడలో విలేకరుల సమావేశంలో,వైద్య నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఆనందయ్య పంపిణీ చేసిన ఔషధంలో ఎటువంటి హానికరమైన పదార్థాలు లేవని తేలింది. ఔషధాల తయారీలో 18 మూలికలను ఉపయోగించామని, నిరూపితమైన ఔషధ లక్షణాలలో అన్నీ సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
“ఇప్పటివరకు 80,000 మంది ఈ ఔషధం తీసుకున్నారు. మేము వారిలో కొంతమందితో మాట్లాడాము మరియు ఎవరి నుండి ఎటువంటి ఫిర్యాదులు లేవు, ” అని నాయక్ చెప్పారు. అయితే, ఔషధం ఆయుర్వేద ఔషధంగా ధృవీకరించబడదని, ఎందుకంటే దీనిని డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం నిబంధనల ఆధారంగా నిర్ణయించాలని ఆయన అన్నారు. “అందుకని, కోవిడ్ -19 నివారణకు ఆయుర్వేద ఔషధం అని మనం పిలవలేము. దీనిని వేరే రూపంలో పంపిణీ చేయడానికి అనుమతించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది, ”అని నాయక్ అన్నారు.
అయితే ఎంతో ప్రజాధారణ పొందిన ఆనందయ్య మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు . అయితే ఇప్పుడు అనందయ్య అదృష్టం మారబోతున్నట్లు కనిపిస్తోంది.రానున్న రోజుల్లో ఆయనను చట్టసభలో చూసే అవకాశాలు చాలా మెరుగు పడుతున్నాయి. ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్ చైర్మన్ మరియు హై కోర్టు న్యాయవాధి సుంకర నరేష్ డిమాండ్ చేసారని వార్తలు వస్తున్నాయి.
తన డిమాండ్ ను తెలియజేస్తూ అతను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ కు ఉత్తరం రాసారు. అయితే దీనికి స్పందనగా గవర్నర్ యొక్క కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఆదిత్యనాథ్ దాస్ కు ఉత్తరం రాసారు.
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 171(3)(ఈ) మరియు 171(5) ప్రకారం ఆనందయ్యను ఎమ్మెల్సీ గా నియమించే అవకాశాన్ని పరిశీలించి వెంటనే ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వన్నీ ఆ లేక లో అభ్యర్ధించారు.తన ఉత్తరానికి గవర్నర్ ముఖ్య కార్యదర్శి స్పందించడమే కాకుండా తన అభ్యర్థనను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినందుకు అతను ఎంతగానో హర్షం వ్యక్తం చేసారు. ఆనందయ్యను ఎమ్మెల్సీ గా నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావలిసిన కార్యాచరణను త్వరలోనే ప్రారంభిస్తుంది అనే ఆశా భావాన్ని వ్యక్తం చేసారు నరేష్.