Anasuya

మంచి గుణపాఠం నేర్పించారు…అనసూయ షాకింగ్ కామెంట్స్

News

కొన్ని రోజులుగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అససియేషన్ ఎనికల పోరులో విజేతల ఫలితాలు వెలువడ్డాయి, మా అసోసియేషన్ ఎలక్షన్ కారణంగా కొంతమంది మెంబర్స్ ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం వల్ల కొంత అసమానతలు ఏర్పడ్డాయి, ఎలక్షన్ ఫలితాలు వచ్చిన వెంటనే కొంత మంది సినీ ప్రముఖులు ఈ అవకతవకలను , గందరగోళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఉంటే అసోసియేషన్ ఆరోగ్యకరంగా ఉంటుందో కొన్ని సూచనలు ఇచ్చి మా అసోసియేషన్ శ్రేయస్సు కొరకు పాటుపడండి అంటూ స్ఫూర్తిని నింపారు. ఇదే ఎలక్షన్ లో కొంతమంది ప్రముఖులు గెలుస్తామని ధీమాతో ఉన్నప్పటికీ ఓడిపోయే సరికి ఆ వార్త మింగుడు పడక కొంత మంది రాజీనామా చేస్తే మరి కొంత మంది తాము సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి గెలవలేదని రాజీనామా చేశారు . అయితే ముఖ్యంగా పోటీదారుల లో అప్పటివరకు భారీ మెజారిటీ అని కన్ఫామ్ అయినప్పటికీ కూడా ఓడిపోయిన వారు మా అసోసియేషన్ మెంబర్స్ ను విమర్శిస్తున్నారు.

ఇదే కోవలో అనసూయ గారు కూడా ఉండటం గమనార్హం , మా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పోటీ చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ జరిగిన ఓట్లలో ఓటమిని చూశారు, అయితే ఓట్ల లెక్కింపు రోజున భారీ మెజారిటీతో అనుసూయ గెలిచిందని మీడియా ఛానళ్లలో ప్రసారం అయింది అయితే సాయంత్రం వరకు వచ్చిన ఫలితాల్లో తాను ఓడిపోయినట్టు తేలింది.

Anasuya

అయితే ఇదే విషయం పైన అనసూయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ , నాకు ఒక విషయం గుర్తొచ్చి నవ్వొస్తోంది.. అది మీతో కూడా పంచుకుంటున్నాను, ఏమనుకోవద్దు.. నిన్న భారీ మెజారిటీ గెలుపు నీదే అన్నారు ఈరోజు ఓడిపోయింది అంటున్నారు అసలు రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుంది అబ్బా అని ఆమె ట్వీట్ చేసింది. మరో ట్వీట్ లో అసలు ఉన్నది 900 మంది ఓటర్లు వాటిలో సుమారు 600 ఓట్ల లెక్కింపు రెండో రోజుకు వాయిదా వేయాల్సినంత సమయం ఎందుకు పట్టింది అంటారు?? ఏదో అర్థం కాక అడుగుతున్నాను లేండి అంటూ మరో ట్వీట్ చేసింది.

ఇక ఈ పరిణామం తర్వాత ఎలక్షన్ లో నిలబడితే నిజాయితీగా ఉండలేమని ఈ రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని తెలియజేశారు.
ఈ ఎలక్షన్ వల్ల ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నానని మళ్లీ నా జీవితంలో రాజకీయాలకు వెళ్లనని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *