Anasuya Dresses

యాంకర్ శివ అనసూయ పై కామెంట్స్.. షో మధ్యలో నుండి వెళ్లిపోయిన అనసూయ..

Movie News

యాంకర్ గా మారిన ప్రముఖ నటి అనసుయా భరద్వాజ్ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పొందుతున్నారు; టీవీ మరియు చలన చిత్రాలలో ఆమె విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఆమె ఎక్కువగా ట్రోల్ చేయబడిన తెలుగు టీవీ వ్యక్తిలలో ఒకరు; ఆమె ఫోటోషూట్లు, బట్టల ఎంపిక మరియు జీవనశైలికి తగిన క్రెడిట్స్ రావడం మాట అటుంచితే ట్రోలింగ్స్ కి ఎక్కువ గురి అవుతున్నారు.

అనసూయ భరద్వాజ్ గతంలో ఒక వీడియో కోసం నెటిజన్లలో ఒక విభాగం ట్రోల్ చేసింది. తన న్యూ ఇయర్ పార్టీ నుండి కేవలం కుటుంబంతో ఉన్న వీడియోలో,షార్ట్స్ ధరించిన అనసూయ, తన కుమారులతో ముక్కాలా ముకాబులాకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు. షార్ట్స్ ధరించడం మరియు ఆమె పిల్లల సమక్షంలో ‘మద్యం సేవించడం’ కోసం ఆమె నెటిజన్లలో ఒక వర్గానికి ఇది నచ్చలేదు. ఆమె ఇటీవల జబర్‌దాస్త్ షో కోసం ఎంచుకున్న ఆకర్షణీయమైన రూపానికి ఆమె ట్రోల్ చేయబడింది.

ఆమె ప్రదర్శన నుండి తన లుక్ యొక్క కొన్ని చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, అభిమానులలో ఒక విభాగం ఆమె ఫ్యాషన్ గేమ్‌ను ఆరాధించగా, మరికొందరు ఆమె టీవీ షో కోసం దుస్తులను ఎన్నుకోవడాన్ని ప్రశ్నించారు. అనసుయా తన ఇటీవలి చీరల కోసం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో భారీగా ట్రోల్ అయ్యింది. చీరలు మరియు మాస్క్ లను ప్రమోట్ చేసే ముందు తనను ఎక్సపోసింగ్ మానెయ్యమని నెటిజన్లలో ఒక విభాగం నినాదాలు చేసింది.

ఇదిలా ఉండగా వచ్చే వారం లో జరగబోయే జబర్దస్త్ టీవీ షో ప్రోమోను మల్లె మాల యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది.అయితే అందులో ఎప్పుడు ఎవరినో ఒకరిని గెస్ట్ గా తీసుకొచ్చే ఆది ఈ సారి యాంకర్ శివ ను తీసుకొచ్చాడు. శివ గురించి అతని ఇంటర్వ్యూల గురించి మనలో దాదాపు అందరికి తెలుసు. అతను ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తు ఉంటాడు.ఇలా ఎన్నోసార్లు ఎంతో మంది సెలెబ్రెటీల ను డైరెక్ట్ గా ఎన్నో బోల్డ్ ప్రశ్నలను అడిగాడు. ఆ వీడియోస్ ఎంత వైరల్ గా మారాయో మనందరికీ తెలుసు.అయితే అది తనను ఎందుకు గెస్ట్ గా తీసుకొచ్చాడో ఇంకా కానీ అతని చేతుల్లో అనసూయ మళ్ళీ ట్రోలింగ్ కి గురి అయ్యింది.

ఆది స్కిట్ అయిపోయిన తర్వాత అనసూయ తో యాంకర్ శివ ‘ నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ఒక ప్రశ్న అడగలనుకుంటున్న అందేంటంటే మీరు ఎందుకు చిన్న చిన్న బట్టలు వేసుకుని ట్రోలింగ్ కి గురి అవుతారు?’ అని అడిగాడు. అందుకు అనసూయ ‘వాళ్లకు తెలీక అంటున్నారు కానీ నువ్వు ఇండస్ట్రీలో ఉంది ఇలా అడగడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

ఇది నా పర్సనల్ విషయం అని కూడా అన్నారు.అందుకు శివ ‘ పర్సనల్ విషయం అయితే ఇంట్లో చేయాకోవాలి బయట కాదు ‘ అని సమాధానం ఇచ్చేసారికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రోజా అయితే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం లో ఉండిపోయారు.అనసూయ ఆది పైన ఫైర్ అయ్యారు ఇంకా షో నేను చేయను అంటూ ఆమె స్టేజి దిగి వెళ్లిపోయారు. ‘మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా?’ అంటూ మండి పడ్డారు అనసూయ.అయితే ఇది ప్రమోషన్స్ కోసం చేశారో లేదా నిజంగానే జరిగిందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.