తెలుగు బుల్లితెర పైనా అనసూయ భరద్వాజ్ అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఇటు వెండితెర పైన మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గొప్ప పేరు గడించిన వ్యక్తి అనసూయ భరద్వాజ్.
కేవలం తెలుగు మాత్రమేగాక భారతదేశంలోని పలు భాష పరిశ్రమలో పని చేస్తూ ఆడియన్స్ కి మంచి పరిచయం ఉన్న వ్యక్తి అనసూయ. ఆమె తగు మాత్రపు పాత్రలు ఎన్నుకొని తనను హైలైట్ చేసే పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ రీతిగా చేసినదే రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర. ఇక తాజాగా రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో కూడా దాక్షాయని అని పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు . ఇక ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.
అయితే గతంలో తమన్నా హోస్ట్‌గా ఉన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నష్టాల బాటన ప్రయాణిస్తూ ఉండగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తమన్నాను తీసేసి ఆమెకు బదులుగా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న అనసూయ ను ఎంపిక చేశారు, ఈ షో కొంతకాలం పాటు నడిచిన గాని ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొంద లేకపోయింది దీంతో షో టిఆర్పి రేటింగ్ భయంకరంగా పడిపోయింది. దీంతో షో నిర్వహణ సంస్థలు ఈ షో నుండి నిష్క్రమించు కోవాలనే ఆలోచనలో పడ్డారు.
త్వరలోనే ఈ షో ఆగిపోను ఉన్నది అయితే అనసూయ హోస్ట్‌గా నిర్వహించిన ఎపిసోడ్లు అన్నీ టెలికాస్ట్ కానందున ఈ నెలలో ఆ ఎపిసోడ్ లన్ని టెలికాస్ట్ చేసుకొని షో ఆగిపోనున్నది.
అయితే తమన్నా వల్ల కానిది అనసూయ వల్ల అవుతుందని ఊహించుకొని అనసూయను ఎంపిక చేసుకున్న ప్రొడక్షన్ యూనిట్ అనసూయ వాళ్ళ కూడా కావట్లేదని గుసగుసలాడటం వల్ల ఆమెను ఘోరంగా అవమానించినట్టు మరియు ఆమె ఈ షో కి దురదృష్టంగా ఉన్నట్టు వారు పరిగణించడం ఆమె ఇమేజ్ ను దించేసి అవమానించినట్టు అయింది. మొత్తంగా షో ఒప్పుకొని తప్పు చేశానని అనసూయ భావిస్తున్నారు.