anasuya-kota-srinivas-rao

నీ అనుభవంలో నువ్వేం నేర్చుకున్నావ్ అంటూ.. కోట శ్రీనివాస్ రావు పై విరుచుకుపడ్డ అనసూయ.

Trending

అసలు పరిచయమే లేని టాప్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు . జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు అతి సన్నిహితురాలై గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నారు, అందరూ యాంకర్లా లా కాకుండా తనదైన శైలిలో జీవించాలనే మనసు కలిగిఉంటారు అనసూయ, మిగతా యాంకర్ లాగా సినిమా హీరోయిన్ వంటి పాత్రలు చేయకుండా తన అభినయానికి సెట్ అయ్యే మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంటారు.

సాధారణంగా సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి మహిళకు ఉండే అలవాటు ఫోటో షూట్ లకు హాజరు కావడం. ఈ ఫోటో షూట్ ద్వారానే తాము లీడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోమని తమ అందాలను చూపించే ప్రయత్నం చేస్తారు, అందాల వలకపోత లో కొన్ని హద్దులు దాటిన పోజులు కూడా ఉంటాయి.

anasuya-kota-srinivas-rao

అనసూయ భరద్వాజ్ కూడా ఇలాంటి ఫోటో షూట్ లు చాలా సార్లు నిర్వహించారు, ఆ ఫోటోలలో ఈవిడ నిజంగా ఇద్దరు పిల్లల తల్లేనా అని అనుకునే రీతిగా తన అందాలను చూపిస్తూ ఉంటారు.

ఫోటోలో తాను ఇచ్చే పోజులు మరియు వేసే వస్త్రధారణ అప్పుడప్పుడు తాను యాంకర్గా చేస్తున్నటువంటి షోలలో కూడా వేస్తూ ఉంటారు. అయితే ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలలో ఆ విధమైనటువంటి వస్త్రధారణ అనేకమంది ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించి అనసూయను విమర్శిస్తూ ఉంటారు.

ఇక విమర్శించే వారి జాబితాలో కోట శ్రీనివాసరావు కూడా చేరిపోయారు, మా ఎలక్షన్ సమయంలో ప్రత్యర్థి పార్టీలో ఉన్న కోట శ్రీనివాసరావు గారు అనసూయ ను గురించి తానెవరో తనకు తెలియదంటూ మాట్లాడారు. అయితే ఎలక్షన్ తర్వాత మరోసారి కోట శ్రీనివాసరావు గారు అనసూయను ఒక ప్రెస్మీట్లో ప్రస్తావిస్తూ ఆవిడ మంచి నటి చక్కటి హావభావాలు చూపించగలరు మరియు చక్కగా డాన్సులు కూడా చేయగలరు కానీ ఆమె వేసుకునే డ్రెస్సులు తనకెందుకో నచ్చవని కోట శ్రీనివాసరావు గారు అన్నారు.

anasuya-Unseen

దీంతో అనసూయ గారు స్పందిస్తూ కోట శ్రీనివాసరావు గారి పేరు ఎత్తకుండా ఆయనకు కౌంటర్ ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఇచ్చారు, తాజాగా ఒక సీనియర్ నటుడు నా పైన కొన్ని విమర్శలు చేశాడు ముఖ్యంగా నా వస్త్రధారణ గురించి మాట్లాడని, సినీ పరిశ్రమలో తల పండిపోయిన ఆ వ్యక్తి అలా మాట్లాడటం సబబు కాదని , సినిమా పరిశ్రమ అంటేనే కొత్త లుక్ మరియు ట్రెండ్ సెట్ చేసేదని ఈ విషయం కాస్త అయినా అర్థం చేసుకోక నీచంగా నా గురించి మాట్లాడాడు, ఆయన మాటలకు నేను ఎంతో దుఃఖ పడుతున్నాను అని అన్నారు.

వస్త్రధారణ అనేది ముఖ్యంగా వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి మరియు చేసే వృత్తి పైన ఆధారపడి ఉంటుంది. నా గురించి మాట్లాడిన ఆయన మందు తాగడం అధ్వాన్నమైన దుస్తులు ధరించడం వాళ్ల పేరు ఎలా సంపాదించుకున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు అని అంటూ కోట శ్రీనివాస రావు పైన ఈ విధంగా రెచ్చిపోయింది ఆయన గతంలో స్త్రీలను కించపరిచేలా ప్రవర్తించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ వాటిని గురించి సోషల్ మీడియా లో ఎవడు పట్టించుకోడు ప్రశ్నించడు, పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు హీరోయిన్లతో షర్ట్ బటన్లు పెట్టుకోకుండా బాడీ ని చూపిస్తూ రొమాన్స్ చేస్తున్నప్పుడు ప్రశ్నించరు.

కానీ మాలాంటి వారిపై విరుచుకు పడటానికి మాత్రం సిద్ధంగా ఉంటారు . నేను ఇద్దరు పిల్లల తల్లిని నా వృత్తిలో ముందుకు వెళ్లడానికి ఎంతో కష్టపడుతున్నాను. మీరు మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడం కంటె మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి . అని ట్వీట్ చేసింది, ఈ ట్వీట్ ప్రజలలో వైరల్ గా మారింది మరియు అనేక మంది ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఉన్నారు, ఇక కోట శ్రీనివాసరావు గారు కూడా స్పందిస్తారెమో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *