ప్రపంచం లో అటు అమెరికా నుండి ఇటు ఆస్ట్రేలియా వరకు గొప్ప సక్సెస్ సాధించిన షో మాస్టర్ ఛెఫ్. తాజాగా ఈ షోను ఒక ప్రైవేట్ నిర్మాణ సమస్త మన తెలుగు భాషలో జెమినీ టీవి లో ప్రసారం చేస్తు ఉండగా మిల్క్ బ్యూటీ తమన్నా హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈ షో వేరే ఫ్యామిలీ ఎంట్టైన్మెంట్ షో ల ముందు నిలువ లేక పోయింది. ఇతర షోలలో పోల్చుకుంటే ఈ షో అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేక పోయింది, తద్వారా నిర్మాణ సమస్త ఈ షో వల్ల కొంత అసంతృప్తిగా ఉంది, ఆ సదరు సంస్థ ఈ షో ను కేన్సిల్ చేసే స్థితిలో ఉన్నారు, ఈ నిర్ణయానికి కారణం తమనానే అని చెప్పవచ్చు.
జెమినీ టీవీ ఒకే సమయం లో ఇద్దరు స్టార్ లను పెట్టీ 2 పెద్ద షోలు చేయటానికి పూనుకున్నారు , జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు మంచి ఆదరణ పొందగా, తమన్నా చేస్తున్న మాస్టర్ చెఫ్ కొన్ని ఒడిదుడుకుల మధ్య ప్రసారం అవుతూ ఉంది.
తమన్నా సీనియర్ హీరోయిన్ పైగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఇక ఈమె తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయని ఈ షో కొరకు కేటాయించింది అయితే తను జెమినీ యాజమాన్యానికి 18 రోజులో ఈ షో యొక్క మొదటి సీజన్ పూర్తిగా చిత్రీకరించుటకు తన మద్దతు తెలుపుతూ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, అయితే ఈ షో ఫ్లాప్ అవుతుండటంతో నిర్మాణ సమస్త షో ప్రసారాలు నిలిపి వేసింది,
ఇక ఈ షో పునః ప్రారంభం అవుతూ ఉండగా తమన్నా తను కుదుర్చుకున్న 18 రోజుల గడువు దాటిపోయింది గనుక తన రెమ్యూనరేషన్ పెంచమని కోరగా , నిర్మాణ సంస్థకు షో నడపటం బరంగా మారింది. ఈ షో అగ్రిమెంట్ ప్రకారం తమన్నాకు ఇలా షో మద్దెలో రెమ్యూనరేషన్ పెంచమనే అధికారం లేదు అని నిర్మాణ సమస్త తెలుపగా తమన్నా భాటియా షో నుండి నిష్క్రమించింది.
ఇక ఈ సీజన్ మిగితా ఎపిసోడ్ లు పూర్తి చేయటానికి హోస్ట్ నీ వెతికే పనిలో పడ్డారు. అయితే వారి దృష్టి బుల్లి తెర పై ప్రభంజనం సృష్టించిన యాంకర్ అనసూయ పై పడింది. ఇక అనసూయ కూడా షో చేయటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం బెంగళూర్ లో ఈ షో అనసూయను హోస్ట్ గా పెట్టీ ఇప్పటికీ 3 ఎపిసోడ్ కూడా చిటికరించిందట. ఇక ఈ శరివరం నుండి ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ షో లో తమనాకు బదులు అనసూయ కనిపించబోతున్నారు.