స్కిట్ మధ్యలో ‘గు..’ అంటూ అనసూయ బూతు మాట..! వైరల్ అవుతున్న జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వీడియో

Movie News

డబల్ మీనింగ్ డైలాగ్స్ విషయానికొస్తే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అందులో ఎక్కువ భాగం ఉండేవే అలాంటి డైలాగులు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ షో ఇంత పాపులర్ అవ్వడానికి కూడా ఆ డైలాగులే కారణం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అంతే కాదు హైపర్ ఆది స్కిట్ లో నిలబడ్డ దగ్గర్నుంచే ఇలా డబల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఎలా ఫేమస్ అయ్యాడో మనందరికి బాగా తెలుసు. అతని స్కిట్ లో ఎక్కువగా గెటప్స్ వేయకున్నా, ఎక్కువగా కష్టపడకున్నా అలవోకగా డబల్ మీనింగ్ డైలాగులు వేసి నవ్విస్తూ ఉంటాడు.

చాలా మంది ఈ షో లో వేసే డైలాగులు హద్దులు దాటుతున్నాయి అని విమర్శించినా కూడా అసలు ఎవరు కూడా తగ్గట్లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది ఈ డైలాగులు మరింత గోరంగా మారుతున్నాయి.ఈ షో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేనంత అసభ్యకరంగా తయారవుతు వస్తుంది. ఒకప్పుడు కేవలం టీం లీడర్లకు , ఆర్టిస్టులకు మాత్రమే పరిమితమైన ఈ డైలాగులు ఇప్పుడు యాంకర్ ల వరకు చేరుకున్నాయి. ఇక రాను రాను జడ్జి సీట్లో కూర్చున్న వారు కూడా ఈ మాటలు మాట్లాడ్తారేమో చూడాలి.

తాజా గా వచ్చిన జబర్దస్త్ షో యొక్క ప్రోమో వీడియో లో అనసూయ భరద్వాజ్ అదిరే అభి స్కిట్ టైం లో ఒక భయంకరమైన బూతు మాట అనబోయింది. ఆమె నిజంగా నోరు జారీ అలా అన్నదో లేక అది స్క్రిప్ట్ లో భాగమో తెలీదు కానీ మొత్తానికైతే ఎప్పుడు కూడా జబర్దస్త్ స్టేజి పైన అనడానికి ఎవరు ధైర్యం చేయని ఒక పెద్ద బూతు మాటనైతే అనబోయింది. అసలు ఆమె అభి టీం స్కిట్ వేస్తున్నప్పుడు ఆమె మధ్యలోకి ఎందుకు ఎంటర్ అయ్యిందో చూద్దాం.

వచ్చే వారం లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియోను ఇటీవలే విడుదల చేసారు షో యొక్క నిర్వాహకులు. అయితే ఆ ప్రోమో లో అదిరే అభి స్కిట్ లో భాగంగా రాజు అనే వ్యక్తి అభి ను ‘ గుర్రాన్ని ముందుకు ఉండేది, ఏనుగుకు వెనకకు ఉండేది ఏంటి’ అని అడిగాడు. అప్పుడు వెంటనే అనసూయ మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ‘గు..’ అంటూ మధ్యలోనే డైలాగ్ ను కట్ చేసింది.అప్పుడు వెంటనే అభి రియాక్ట్ అవుతూ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అనసూయ వైపు తిరిగి అంటాడు. అలా అనసూయ సమాధానం విన్న జడ్జిలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.కొంత మంది షో నిర్వాహకులను తిడుతుంటే ఇంకొంత మంది షేర్ లు కామెంట్లు పెడుతూ ఈ వీడియో కి మరింత హైప్ క్రీట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.