anasuya-tweet-to-ktr

సార్ నాకు ఒక డౌట్ అంటూ అనసూయ కేటీఆర్ కే హిత బోధ చేసిన ట్వీట్ వైరల్.

Trending

యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉంటారా? బుల్లి తెరపై ఎంత మంది యాంకర్ లు వచ్చిన అనసూయ మాత్రం తన అభినయంతో ఒక సునామీల ప్రభంజనం సృష్టిస్తు దూసుకెళ్తుంది.

టాప్ యాంకర్ గా పేరు గాంచిన ఆమె బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా బిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకుంది. గతం లో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల మనసును తన నటనతో ఆకట్టుకుంది , ఈ సినిమా తర్వాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది, ఇక అనసూయ కూడా తనకు పేరు తెచ్చి పెడ్తున్న ఇలాంటి పాత్రలకే ప్రాముఖ్యత నిస్తు ఉంది. అందుకే మిగితా యాంకర్ల కంటే తక్కువగా సినిమాలు చేస్తుంటుంది అనసూయ.

ఇలా వరుస ఆఫర్లతొ అన్ని రంగ్లలో బిజీ గా ఉంటున్న అనసూయ సోషల్ మీడియా లో కూడా బిజీ గా ఉంటూ తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలు, తన లేటెస్ట్ ఫోటోలను మరియు సినిమా విషయాలను ప్రేక్షకుల తో పంచుకుంటూ ఉంటుంది. అయితే అనసూయ కేవలం సినిమా విషయాలకు మాత్రమే కాక సమాజిక విషయాల పై కూడా స్పందిస్తూ ఉంటారు.

anasuya-tweet-to-ktr

తాజాగా ఒక సామాజిక అంశం పైన కేటీఆర్ నీ ప్రశ్నించింది అనసూయ. స్కూల్ రీఓపెనింగ్ పై అనసూయ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో భాగంగా కేటీఆర్ సార్ నాకో డౌట్, అసలు లాక్ డౌన్ ఎందుకు పెట్టారు. ఆ తర్వాత ఎందుకు తీసేసారు అర్థం చేసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో మనం అందరమూ టీక వేసుకున్నామని ధీమాగా ఉండొచ్చు . అయితే టీక వేసుకోవాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏమని భరోసా ఇచ్చి స్కూల్ లకు పంపించమంటారు సార్.

పాఠశాలలు పిల్లల తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి సార్. బలవంతంగా స్కూల్ కి రప్పించుకొని ఏమైనా జరగరానిది జరిగితే మా బాధ్యత లేదని ఎలా సంతకం చేయించుకుంటున్నాయి సార్. ఇది అసలు న్యాయం ఎలా అవుతుందో మీరే చెప్పండి సార్, ఎప్పటిలాగే మీరు మాకు సరైన మార్గాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. అనసూయ చేసిన ఈ ట్వీట్ అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published.