మీరు లోపల అది వేసుకోలేదా అంటూ నటిపై ట్రోల్స్.. ఆ ఫొటో పై అనసూయ రియాక్షన్..

News Trending

సోషల్ మీడియా వినియోగదారులు రోజు రోజుకి విపరీతంగా పెరగడం ద్వారా చాలామంది సెలెబ్రిటీలు కొత్త కొత్త చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఎవరి గురించి ఆయన వారికి నచ్చినట్లుగా కామెంట్స్ చేసే వెసులుబాటు ఉండడం మూలంగా చాలా మంది సెలెబ్రెటీల పైన చేసే కామెంట్స్ హద్దులు దాటుతున్నాయి.

ట్రోలింగ్ చేయడం ఒక లిమిట్ వరకు అయితే సమస్య లేదు కానీ కొంత మంది అదే పనిగా హీరోయిన్లపై నీచంగా కామెంట్స్ పెట్టడం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. తాజాగా ఓ మరాఠి నటి అయిన హేమాంగి కవి పై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేశారు నెటిజన్లు.ఓ వీడియో లో ఆమె వస్త్రధారణ సరిగా లేదంటూ నెటిజన్స్ లిమిట్ క్రాస్ చేసి కామెంట్స్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మరాఠీ నటి హేమాంగి కవి తను చపాతీలు చేస్తున్న వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే ఆమె చపాతీలు చేస్తున్న స్టైల్ ను చూడటం మానేసి కొంత మంది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై నీచంగా కామెంట్స్ చేశారు. అక్కడికే ఆగకుండా ”ఏంటి మీరు లోపల ఏం వేసుకోలేదా..?, లోపలి బాడీ పార్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి” అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తూ ఆమెను నీచంగా ట్రోల్ చేశారు.

 

ఆ కామెంట్స్ చూసిన దీనిపై ఆ నటి చాలా ఘాటుగానే స్పందించారు. ”మగవారికి ఉండే అన్ని బాడీ పార్ట్స్ మాక్కూడా ఉంటాయి. నా మిగతా బాడీ పార్ట్స్ అయిన కాళ్లు చేతులు కదులుతుంటే అవి కూడా కదులుతాయి. ఒకవేళ అలా అవి కదలని వారు ఎవరైనా మీకు తెలిస్తే నాకు చూపించండి. అయినా నేను నా ఇంట్లో ఏం ధరించాలో ఏం ధరించకూడదో అనేది నా ఇష్టం” అంటూ ట్రోలర్స్‌పై గట్టిగానే ఎటాక్ చేసింది నటి.

రంగస్థలంలో ‘రంగమ్మత్త’ గా అనసూయ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ 

నేనింకా బ్రతికుంది నీకోసమే అంటూ అనసూయ

స్కిట్ మధ్యలో ‘గు..’ అంటూ అనసూయ మాట

అయితే ఆ నటి హేమాంగి కవి చేసిన డేరింగ్ కు మరియు ఆవిడ ఇచ్చిన ఆ స్ట్రాంగ్ కౌంటర్ కు జనాలల్లో ఈ ఇష్యూపై ఇంకెక్కువ చర్చలు నడుస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి హేమాంగి గారికి కొంతమంది ప్రముఖ నటీమణుల మద్దతు లభిస్తోంది. ఆమె ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లై కి వారు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు సినీ తారలు. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ ఈ ఇష్యూ పై రియాక్ట్ అయ్యి వస్త్రధారణ అనేది కచ్చితంగా అది మా ఛాయిస్, అందులో ఎవరికి ఎటువంటి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు.

అయితే తాజాగా ఈ ఇష్యూపై తన స్పందనను తెలియజేసిన  అనసూయ ‘నువ్వు చాలా ధైర్యవంతురాలివి అలా నీచంగా కామెంట్స్ చేసేవారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చావ్’ అంటూ కామెంట్ చేసింది. అయితే ట్రోలర్స్‌ని ఘాటుగా ఎదురుకునేవారిలో ఎప్పుడూ ముందుండే అనసూయ ఇప్పుడు తోటి నటీమణులకు కూడా తన సపోర్ట్ అందజేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *