anchor-rashmi-married

రష్మి కి సుధీర్ కి ఎప్పుడో పెళ్లి అయింది అంటున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ సతీష్.

News

ఇంటి గుట్టు ఇంట్లోవారికి తెలవదా అన్నట్టుగా రష్మీ సుధీర్ ల జంట గురించి సతీష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మల్లెమాల కాన్సెప్ట్ తో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ భారీ సక్సెస్ లతో దూసుకెళ్తున్న కామెడీ షో. ఈ షోలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా అందమైన యాంకర్లు రష్మీ మరియు అనసూయ ప్రేక్షకులను మాయ చేస్తూ అలరిస్తూ ఉంటారు.

అయితే అనసూయ కంటే రష్మి ఎక్కువగా చర్చలకు వస్తూ ఉంటుంది. దానికి కారణం సుధీర్ రష్మీల లవ్ ట్రాక్ అని చెప్పవచ్చు. వీళ్ళ లవ్ ట్రాక్ కి చాలా మంది అభిమానులు ఫిదా అయిపోయారు. వీళ్లకు ఉన్న క్రేజ్ వల్ల వీరిద్దర్నీ బేస్ చేసుకొని కొన్ని షో లు నిర్మించబడ్డాయి.

వీరిద్దరు ఒక స్టేజ్ మీద ఉన్నారంటే ఆ షో రేటింగ్ అమాంతం పెరిగి పోతుంది అంతటి ఇంప్యాక్ట్ ను బుల్లి తెరపై సృష్టించారు. కొన్ని షోస్ లో వీరిదర్కి పెళ్లి చేస్తున్నట్టు నిర్వహించారు వాటిని చూసిన ప్రేక్షకులు వీరికి నిజం గానే పెళ్లి అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారు.

అయితే అర్దం అయి కానట్టుగా వన్ సైడే లవ్ స్టొరీ గా అనిపిస్తూ పాపులార్టీ సంపాదించుకున్న రష్మీ సుదీర్ ల పైన జబర్దస్త్ ఆర్టిస్ట్ వీరి గురించి ఒక బాంబ్ వార్త బైట పెట్టాడు.

anchor-rashmi-married

చంద్ర , ముక్కు అవినాష్ లతో జబర్దస్త్ స్టేజ్ పంచుకుని ప్రజలను కామెడీ తో అలరించిన వ్యక్తి సతీష్. ఒకే షో లో పనిచేస్తున్న సతీష్ రష్మీ సుధీర్ ల ప్రేమ గురించి ఓపెన్ అయ్యాడు. ఈ విషయంపై మాట్లాడుతూ షో నిర్వాహకులకు అసలు పని పాట లేనట్టు రష్మీ సుధీర్ కి పెళ్లి చేసి వారి మధ్యలో ఏదో ఉందంటూ ప్రజలలో ఒక అబద్ధపు భావన కలిగిస్తున్నారని జనాలు వాటిని నమ్మి పిచ్చోలవుతున్నారని మాట్లాడాడు.

అయితే షూటింగ్ అయిపోయాక ఎవరు ఎలా ఉంటారో ప్రేక్షకులకు తెలియదని షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటారన్న విషయం పబ్లిక్ తెలియదని. ప్రేక్షకులకు ఈ విషయము అర్థం కాక వీళ్లిద్దరూ నిజజీవితంలో కూడా కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారని అని ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఆయనకు ఎదురైన ఒక అనుభవం గురించి ఈ రకంగా చెప్పుకొచ్చాడు.

తాను ఒక సారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి సుధీర్ రష్మీ ల లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరు నిజంగానే కలిస్తే బాగుంటుంది అని తనతో అన్నట్టు చెప్పారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అసలు రష్మి కి పెళ్లి అయింది అన్న విషయము వాడికి తెలుసా. సుధీర్ కి పెళ్లి అయిందా కాలేదు అనే విషయం అయినా తెలుసా. ఏదో షో నిర్వహిస్తున్న నిర్వాహకులు వాళ్ళ టి ఆర్ పి కోసం చేసే డ్రామాను నమ్మిస్తున్నారు. ఇట్లా ఏది చూసినా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నవారు ఉన్నంతకాలం నిర్వాహకులు ప్రేక్షకులను రెచ్చగొడుతూ పిచ్చివాళ్ళ చేస్తూనే ఉంటారని సతీష్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *