అశు రెడ్డి పరువు తీసిన యాంకర్ రవి..! సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియో…

News

బుల్లి తెర పై కొంత మందే మంచి మగ యాంకర్ లు ఉన్నారు, ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. అందులో ప్రదీప్ మాచి రాజు ఒకరకైతే ఇంకొకరు యాంకర్ రవి. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం తెలుగు ప్రయక్షకులలో సంపాదించుకున్నాడు యాంకర్ రవి. అప్పటికప్పుడు పంచ్ డైలాగు లు సిద్ధం చేసి ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు రవి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి యాంకర్ రవి ప్రస్తుతం ఎన్నో షో లకు హోస్ట్ గా ఉంటున్నాడు.

అశు రెడ్డి తో హ్యాపీ డేస్ అనే షో కు కో- యాంకర్ గా ఉంటున్నాడు. అయితే రవి తన తోటి యాంకర్ లను ఎలా అడుకుంటాడో మనం చాలా సార్లు చూసాం. ఇందుకు పటాస్ షో లో శ్రీముఖి గారే మంచి ఉదాహరణ. పటాస్ లో శ్రీముఖి ని బండ దాన అని రవి ఆటపట్టించడం మనం చాలా సార్లు చూసాం. ఈ సారి మాత్రం అశు రెడ్డి బలైపోయింది.రవి టీవీ లొనే కాదు సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటాడు.

తన జీవితం లో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే అశు రెడ్డి తో ఒక రొమాంటిక్ వీడియో చేద్దాం అని ఒప్పించి ఆమె వస్తుండగా వీడియో రికార్డ్ చేసి దానికి ‘వనాస్థలి పురం పంది’ అనే ఆడియో ట్రాక్ ను పెట్టి సోషల్ మీడియా లో షేర్ చేసాడు. అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. రవి చేసిన పనికి చాలా మంది కుర్రాళ్ళు అన్న నువ్వు సూపర్ అన్నా అంటూ కామెంట్స్ పెట్టారు. దానికి అశు రెడ్డి రియాక్ట్ అయ్యారు, “తర్వాత నువ్వు కూడా దొరుకుతావ్ రవి కానీ వీడియో నిజంగా చాలా ఫన్నీ గా ఉంది నవ్వు ఆపుకోలేకపోతున్నా” అంటూ కామెంట్ పెట్టింది. దానికి రవి ” నువ్వు వనస్థలిపురం ఎప్పుడు వెళ్ళావ్” అని కామెంట్ పెట్టాడు. ఏదేమైనా ఈ వీడియో వల్లా చాలా ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు.

అశు రెడ్డి సమంత వాయిస్ కి డబ్ స్మాష్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది . దాంతో ఆమె కు టీవీ ల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు టీవీ షో లల్లో కూడా బాగా రాణిస్తున్నారు ఆమె. ఆమె సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటారు. తన అభిమానులకు తన విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి చెందిన అషూ రెడ్డి టీవీ హోస్ట్‌గా రవీతో కలిసి హోస్ట్ చేసిన నాన్-ఫిక్షన్ షో హ్యాపీ డేస్‌తో టీవీ హోస్ట్‌గా అడుగుపెట్టింది. ఈ ప్రదర్శన జూన్ 7 (సోమవారం) నుండి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *