anchor-ravi-nominations

నామినేషన్స్ కింగ్ యాంకర్ రవి,బిగ్ బాస్ ఆడే వింత నాటకంలో ప్రతీసారీ బలి పశువు అవుతున్నాడా?

Trending

పాపం కొందరి జాతకాలు అంతే, ఏదో అనబోయి ఆవేశములో ఆలోచించకుండా ఇంకేదో అనేస్తూ ఉంటారు. అందరి దృష్టిలో చెడుగా ప్రొజెక్ట్ అవుతారు కొంతమంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నది యాంకర్ రవి. బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా గొడవ జరిగినప్పుడు, వాటిని సార్ట్ అవుట్ చేసే క్రమములో యాంకర్ రవి ఒకటి చెప్పాలని అనుకుని, ఇంకేదో చెప్పేస్తాడు. అందువల్ల మిగతా హౌస్ మేట్స్ దృష్టిలో యాంకర్ రవి చాలా కన్నింగ్ గా గేమ్ ఆడుతున్నవాడిలా కనిపిస్తున్నాడు. ఇంతకుముందే నటరాజ్ మాస్టర్ చెప్పినట్టుగా, యాంకర్ రవి ఒక గుంట నక్కలా హౌస్ మేట్స్ దృష్టిలో మారిపోయాడు.

నిజానికి యాంకర్ రవి చాలా ఫెయిర్ గానే గేమ్ ఆడుతున్నాడు. కానీ అందరికీ ఈజీ టార్గెట్ అయిపోయాడురవి. మిగతా హౌస్ మేట్స్ రవి గురించి ఎన్ని అనుకున్నా, విధి ఎంతగా వెక్కిరించినా, చివరికి బిగ్ బాస్ సైతం రవి మీద శీతకన్ను వేసినా, కేవలం అంటే కేవలం ప్రేక్షకుల సపోర్ట్ తో మాత్రమే హౌస్ లో యాంకర్ రవి ఇంకా కొనసాగుతున్నాడు.

anchor-ravi-nominations

అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుండే అంటే మొదటి వారం నుండే యాంకర్ రవి ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ లోకి వస్తున్నాడు. క్రమం తప్పకుండా వరుసగా 8 వారాల నుండి ఇలా జరుగుతోంది. ప్రతీ వారం ఏదో ఒక కారణంతో రవి నామినేషన్ లోకి రావడం రివాజు అయిపోయింది. గత వారం అయితే మరీ దారుణంగా శైలజా ప్రియా రవిని నామినేట్ చేసింది. దానికి చెప్పిన కారణం కూడా చాలా సిల్లీగా ఉంది. కేవలం సోఫా మీద టవల్ ఆరేసినందుకు శైలజా ప్రియా నామినేట్ చేసింది. అందుకు వెంటనే సన్నీ కూడా అంగీకారం తెలిపాడు. కానీ విధి సైతం వెక్కిరిస్తున్నా యాంకర్ రవిని  బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం అక్కున చేరుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దాదాపు డబ్బై కెమెరాలను చూసి ప్రతీవారం ఎవరిని ఎలిమినేట్ చేయాలో ప్రేక్షకులు నిర్ణయిస్తుంటారు. నిజానికి యాంకర్ రవి కొంచెం మెచ్యూర్డ్ గానే గేమ్ ఆడుతున్నాడు. కానీ మిగతా హౌస్ మేట్స్ కి అది చాలా కన్నింగ్ గేమ్ లా కనిపిస్తోంది. దాంతో రవిని అందరూ ఒక గుంట నక్కలా బావిస్తున్నారు. హౌస్ లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చిన తనే చొరవ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించి హౌస్ లో ఒక మంచి హార్మోని క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నాడు రవి. ప్రేక్షకులకి అది స్పష్టంగా అర్ధం అవుతుంది. అయితే యాంకర్ రవి హౌస్ లో మంచి హార్మోని కోసం కృషి చేసే క్రమములో ఒక్కొక్కసారి అయోమయానికి గురవుతున్నాడు. ఈ అయోమయమే మిగతా హౌస్ మేట్స్ దృష్టిలో రవి గురించి చెడుగా భావించడానికి అవకాశం ఏర్పడుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన మొదట్లో ఎంతో సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శించిన యాంకర్ రవి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడంతో తనలోని సెన్సాఫ్ హ్యూమర్ ను కంట్రోల్ చేసుకుంటున్నాడు పాపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *