రాజీవ్ కనకాల – సుమ విడిగా ఉండడానికి కారణం అదేనట.! క్లారిటీ ఇచ్చిన రాజీవ్..

News

తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో అత్యంత ఫేమస్ జంటలలో సుమ, రాజీవ్ కనకాల జంట కూడా తప్పకుండా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాతికేళ్ళ వీరి వైవాహిక జీవితం లో ఎన్నో మర్చిపోలేని స్వీట్ మెమోరీస్ ఉన్నాయి.కానీ వారి జీవితంలో కూడా కొన్ని చేదు సంఘటనలు కూడా ఎదురుకోవలిసి వచ్చింది. ఆ మధ్య ఎక్కడ చూసినా వీరు ఇద్దరూ త్వరలోనే విడిపోతున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే సుమ కనకాల తెలుగు బుల్లితెరపై ఇక పెద్ద స్టార్ యాంకర్ కాబట్టి ఈమెకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అది తెగ వైరల్ అవుతూ వచ్చింది.

అయితే క్రికెట్ ప్ర‌పంచంలో ఎంత‌మంది గొప్ప బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్క‌ర్ ఒక్క‌డే అయినట్లు, తెలుగు బుల్లితెరపై కూడా చాలా మంది గొప్ప హోస్టులు మరియు యాంక‌ర్లు ఉన్నప్పటికీ అంద‌రికీ గురువు సుమ గారే అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏకంగా రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరను మకుటం లేని మహారాణి లాగా ఏలుతుండడం అంటే అది అస్సలు సాధారణమైన విషయం కానే కాదు.

తరచుగా ఎంతో మంది కొత్త యాంక‌ర్స్ వ‌చ్చిన గ్లామ‌ర్ షోలు చేస్తున్న ఈ టైంలో కూడా ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే మాములు మాట కాదు. కానీ దీనిని సుమ సుసాధ్యం చేసి చూపించింది. పైగా సుమ గారు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కేర‌ళ రాష్ట్రంలో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఇక్క‌డికి వ‌చ్చి ఇప్పుడు మన తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అయితే ఆమె పారితోషకం విష‌యంలో మాత్రం ఎప్పుడూ కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది.

Suma Rajiv Kanakala Unseen Photo
Suma Rajiv Kanakala Unseen Photo

సుమ గారు హీరోయిన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తారని, ఎందుకంటే ఆమె ఎప్పుడు చూడూ ఏదో ఒక షో చేస్తూనే ఉంటుంది అని ఆమె సంపాదన ల‌క్ష‌ల్లోనే ఉంటుందని మరియు ఆమె ఆస్తి కోట్ల‌లో ఉంటుంద‌ని వార్త‌లు ఎప్పుడు ఎక్కువగా వినిపిస్తు ఉంటాయి. దీనిపై ఆమె భ‌ర్త రాజీవ్ క‌న‌కాల స్పందించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు.

Suma Rajiv
Rajiv kanakala Suma

సుమ కేవలం త‌న సొంత టాలెంట్ తోనే ఈ స్టేజ్ కి వ‌చ్చింద‌ని, అయితే ఆమె క‌ష్టంలో తనకు ఎటువంటి భాగం లేదని స్పష్టం చేశాడు రాజీవ్. దేవదాస్ కనకాల మరియు లక్ష్మీదేవి కనకాల గార్లకు కోడలు కావడంతో ఏమైనా సహాయం అయిందేమో నాకు తెలీదు కానీ నేను చేసింది మాత్రం జీరో, నా సహాయం మాత్రం ఏం లేదంటున్నాడు కనకాల. ఇక సుమ గారి పారితోషకం విషయంలో కూడా రాజీవ్ కనకాల కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసాడు.

స్టార్ హీరోయిన్ల‌కు మించిన రెమ్యునరేషన్ సుమ తీసుకుంటుంద‌ని ప్ర‌చారం చేయ‌డంలో అసలు ఎటువంటి అర్థం లేద‌ని స్పష్టం చేశాడు ఆయన. అయితే ఆమె పారితోషకం ల‌క్ష‌ల్లో తీసుకుంటుంద‌న్నారు కానీ ఎన్ని ల‌క్ష‌లు తీసుకుంటుంద‌నేది మాత్రం స్పష్టత ఇవ్వలేదని అంటున్నాడు రాజీవ్. అయితే రోజుకు ఎనిమిది గంట‌లు ఆమె నిలబడి అన్ని లైట్స్ మ‌ధ్య‌లో ప్రోగ్రామ్స్ చేయ‌డం అంటే అది మాములు విష‌యం కాద‌ని ఒక్క‌సారి ఆమె పడుతున్న కష్టం మీరే ఆలోచించండి అన్నాడు రాజీవ్ క‌న‌కాల‌.

ఇదిలా ఉండగా సుమతో విడిపోయాను అనే పుకార్ల పై కూడా రాజీవ్ కనకాల స్పందించాడు. వాస్తవానికి కొన్ని రోజులు సుమతో విడిగా ఉన్నాను అనే మాట నిజమే.మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు ఒక్కరే మా ఊరు మణికొండలో ఉండిపోయారు,అయితే ఆ టైంలో నేను సుమ ఎల్ అండ్ టీలో ఉన్నాం అని చెప్పాడు రాజీవ్.

Rajiv kanakala with parents
Rajiv kanakala with parents

“అమ్మ చనిపోయిన తర్వాత నాన్నను కూడా మా ఇంటికి తీసుకొద్దాం అనుకున్న కానీ ఆయన యొక్క బుక్ లైబ్రరీ చాలా ఎక్కువగా ఉన్నందున అది మేము ఉంటున్న ఇంట్లో పట్టకపోయేసరికి, నేను కూడా మా నాన్న తో కొంత కాలం మా ఊరిలోనే ఉండిపోయాను” అని వివరించారు రాజీవ్. అయితే ఆ కొద్ధి రోజులు మేము దూరంగా ఉండాల్సిరావడంతో మేము నిజంగా విడిపోయామని కొందరు చెత్త వార్తలు రాసేసారన్నాడు రాజీవ్. వాస్తవానికి తామెప్పుడూ కూడా విడిగా ఉండే ఆలోచన చేయలేదని, వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు లేవనీ క్లారిటీ ఇచ్చాడు యాంకర్ సుమ భర్త.

  ఇది కూడా చదవండి ==>>  అనసూయ పరువు తీసిన సుమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *