annapurna-suma

‘వారు నా భూమిని కబ్జా చేశారు..రాజీవ్,సుమలకు నా ఉసురు తగులుతుంది’.. సీనియర్ నటి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్.!

News

పరిశ్రమలో సీనియర్ నటిగా అన్నపూర్ణమ్మ ఇప్పటికే వందలాది చిత్రాల్లో నటించింది. సీనియర్ హీరోలతో నటించడమే కాకుండా ప్రస్తుత సినిమాల్లో నటిస్తున్న అన్నపూర్ణమ్మ అందరికీ ఇష్టమే. అయితే, ఆమె తన సినీ జీవితంలో కొన్నేళ్లుగా అపార్థాలతో బాధపడుతోందని వ్యాఖ్యలు ఉన్నాయి. తన సీనియారిటీ కి తగ్గట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడే అన్నపూర్ణమ్మ,కొంతమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలతో చిన్న చిన్న గొడవలు జరిగాయి అని వెల్లడించింది.”

నేను కొంతమంది దర్శకులతో కలిసి పనిచేయను అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు” అని ఆమె చాలా సార్లు చెప్పారు. సినిమా సెట్‌లో సూపర్ స్టార్ కృష్ణ ఆమె పై అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా, పరిశ్రమ గురువుగా పిలువబడే దేవదాస్ కనకాల (రాజీవ్ కనకాల తండ్రి) తో భూ సమస్యలో మోసం చేయబడ్డానని ఆమె చెప్పారు.

దేవదాస్ కనకాల చనిపోయాక అతని కుమారుడు రాజీవ్ కనకాలతో ఆ సమస్య గురించి మాట్లాడాను అని ఆమె చెప్పింది .‘రాజీవ్ ఈ విషయంపై ఒకసారి స్పందిస్తూ ఫోన్ కాల్ మాట్లాడాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసిన అతను బిజీగా ఉన్నట్లు వచ్చేది. ఆమె నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఫోన్‌ను ప్రయత్నిస్తూనే ఉన్నారటా, స్పందన లేనందున ,అతని ఫోన్ నెంబర్ ఇదేనా అని అతని మధ్యవర్తిని అడిగాను, అతను అవును ఇదే అతని నంబర్ అన్నాడు.

అప్పుడు తెలిసింది నా నెంబర్ బ్లాక్ అయిందని. అతను ఎంత డబ్బును సంపాదించినా, ఆ డబ్బును తన కొడుకుకే ఇస్తాడు కదా, గతంలో చాలాసార్లు గొడవ జరిగినప్పుడు రాజీవ్ కనకాల అక్కడే ఉన్నాడు. కనీసం అతను మొత్తం భూమి ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇవ్వగలడు.నేను భూమి కోసం భూమినే కాదా అడుగుతున్నాను. వారికి ఏమీ ఇచ్చేది లేదని అతను చెప్పినప్పుడు నేను పోనీలే అని అనుకున్నాను.

నేను అలాంటి నష్టాలు మరియు మోసాల గురించి మాట్లాడను ఎందుకంటే జరిగినదాంట్లో నా తప్పు కూడా ఉంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు నేను ఇక్కడ భూమి కొన్నాను. దేవదాసు కనకాలా ఎన్నో సంవత్సరాల క్రితం అంటే దాదాపు 22 సంవత్సరాల క్రితం ఈ భూమిని నాకు అమ్మారు. నేను అమ్మిన భూమిని తిరిగి వెంచర్ చేసి వేరొకరికి అమ్మారు. అతను ఆ భూమిని నాకు అమ్మినట్లు వారి కుటుంబ సభ్యులకు అందరికి తెలుసు కాని వారు తమకు తెలియదని చెప్పారు.

పోనీలే వారు ఈ భూమిని పట్టుకునే ఉంటారా ?? నేను కూడా ఎప్పటికి పట్టుకొని ఉంటానా? నేను వాలకన్న కొంచెం ముందు వెళ్తాను, వారు నా తర్వాత వెళ్తారు. ఎవరైనా ఎప్పటికైనా ఒకరోజు భూమిని వదిలి వెళ్లిపోవాల్సిందే కదా?. ఇది శాపం అనుకుంటారో , ఇకేదైన అనుకుంటారో మీ ఇష్టం. నేను ఒక సమయంలో ఎపిలో కూడా భూమి కొన్నాను. దానిపై చాలా వివాదాలు ఉన్నాయి. నేను రెండున్నర ఎకరాలు కొన్నాను, అది నాకు ఇవ్వలేదు.

నేను నా భూమి తగాధం విషయం కోర్టులో పెడితే ఏకంగా 12 సంవత్సరాల తరువాత ఆ భూమి నాకు తిరిగి ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను కొన్న ఆ భూమిలో పేదలకు ఇళ్ళు కడదామని చూసారు. మా తమ్ముడు దానిపై కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ స్థలం తిరిగి మాకే వచ్చింది. కాకపోతే మేము 12 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. భూముల విషయంలో లో ఇలా నాకు చాలా సార్లు జరిగింది ”అని అన్నపూర్ణమ్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *