anupama-parameswaran

అనుపమ బికినీ ఫోటో అడిగిన నెటిజన్ , ఇంటికి పంపుతాను అడ్రస్ ఇవ్వమన్న అనుపమ.

News

కేవలం ఐదు అంటే ఐదు సంవత్సరాలలోనే అచ్చమైన సౌత్ ఇండియన్ బ్యుటిగా ప్రేక్షకుల మనుసు దోచేసి గొప్ప స్టార్ డం సంపాదించుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.

సినిమాల్లోనే కాకుండా సాధారణంగా కూడా ప్రేక్షకుల చేరువలో ఉంటూ తన అభీమానులను అలరించడానికి టిక్ టాక్ , రీల్స్ లాంటివి చేస్తు సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందినట్టుగాని, టిక్ టాక్ లాంటి ఆప్ లలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అనుపమ ముఖకాంతి వేరే హీరోయిన్లో లేదు అనే టాక్ ప్రేక్షకుల మద్య చెక్కర్లు కొడుతూ ఉంది.

అనుపమ 2015 లో మలయాళంలో విడుదలైన ప్రేమం సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా మంచి సినిమాల్లో నటించేందుకు ఆపర్లు అందుకున్నారు. ఈ రీతిగా తెలుగు, మలయాళ ,కన్నడ ,తమిళ్ చిత్ర పరిశ్రమలో నటించారు. తొలుత సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసిన అనుపమ, ఇప్పుడు మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగి ఆమె క్లాసికాల్ లూక్స్ కి సూట్ అయ్యే ఫీల్ గుడ్ సినిమాలు చేస్తూ ఉన్నారు.

అనుపమ కేరళలోని త్రిశూర్ జిల్లా, ఇరింజలకుడ అనే ప్రాంతంలో జన్మించారు. అక్కడ ఆమె cms కాలేజికి హజరయ్యే వారు కానీ నటనంటే అమితమైన ప్రేమ ఉండటం.వాళ్ళ చదువు ఆపేసి నటనపైన ద్యాస పెట్టి నటనకు సంబందించిన ప్రతి విషయంలో తర్ఫీదు పొందారు.

anupama-parameswaran
anupama parameswaran

తను తర్ఫీదు పొందుతున్న సమయంలోనే ప్రేమమ్ లో నివిన్ పౌలీతో కలిసి నటించే అవకాశం పొందింది. ఇది ఆమెకు మొదటి సినిమా అయినప్పటికి మంచి పేరు సంపాదించుకొని మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం పొందుకుంది , ఆ తర్వాత మలయాళ చిత్రం జేమ్స్ & ఆలిస్‌లో అతిధి పాత్రలో నటించింది.
2016 వచ్చినటువంటి అ ఆ సినిమాలో నాగవల్లి పాత్ర తో తెలుగు చిత్రాలలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో అప్పటికే ఫాంలో ఉన్న సమంతాకు పోటి పడుతూన్నట్టు నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ సపోర్టింగ్ ఆక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ప్రేమం సినిమా తెలుగు రీమేక్ వెర్షన్ లో కూడా నటించి ఇంకా ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
2017 లో కోడి సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఈ చిత్రం తర్వాత వరుసగా తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు.

ఇలా సక్సెస్ తో ముందుకు వెళ్తున్న అనుపమకు 2019 కన్నడ సినిమా నటసార్వభౌమ చిత్రంతో కన్నడ పరిశ్రమలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్న అనుపమకు రాబోయే 2022 సంవత్సరంలో కూడా ఖాళీ లేనంతగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

అయితే ఆమెకు తన నటన జీవితం ప్రారంభంనుండే మంచి క్రేజ్ ఉన్న హీరోలతో కలిసి నటించే అవకాశం రావటం తన అదృష్టమే అని చెప్పుకోవాలి, అదే ఈ రోజు ఆమెను గొప్ప స్థాయిలో నిలిపింది. అని ప్రేక్షక ప్రపంచం బావిస్తుంది.

ఇంత సక్సెస్ తో ముందుకు దుసుకేల్తున్నా కూడా ఒక సాదారణ వ్యక్తి లాగా సోషల్ మీడియాలో రక రకాలుగా తన ప్రతిభను చూయిస్తూ వీడియోలు చేస్తూ, తన గురించి ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ఇస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే తాజాగా తన అభిమానులతో మాట్లాడడానికి ఒక ఇన్స్టాగ్రామ్ సెషన్ లో పాల్గొన్నది. ఆ సెషన్ లో అభిమానులే కాకుండా నేటి జనులు కూడా రకరకాల ప్రశ్నలు వేయగా అన్నిటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ సెషన్లో కొంతమంది మీ తర్వాతి ప్రాజెక్టులు ఏంటి అని అడగగా, మరి కొంతమంది తెలుగు, తమిళ్ భాషలో మాట్లాడాలని కోరారు.ఇంకొంత మంది నీకు ఏదంటే ఇష్టం వంటి ప్రశ్నలు అడిగారు అన్నింటికీ అనుపమ సమాధానాలు ఇస్తూ వచ్చింది.

ఇంతలో ఒక వ్యక్తి బికినీలో ఉన్న తన ఫోటోను పంపమన్నాడు. దాంతో అనుపమకు చిర్రెత్తుకొచ్చింది. నీ అడ్రస్ పంపు నేను ఫోటో పంపుతాను ఇంట్లో ఫ్రేమ్ చేయించి పెట్టుకో అంటూ ఫైర్ అయ్యింది. మిగితా నెటిజనులు అనుపమపై సానుభూతితో ఒక మంచి బిజీ యాక్టర్ అయ్యుండి, ప్రజలతో ఓపిగ్గా మాట్లాడడానికి ముందుకు వచ్చిన అనుపమ మంచితనాన్ని అవమానించేట్టుగా మాట్లాడడం సంస్కారం కాదంటూ సదరు నెటిజనుని గద్దించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *