గత జూలై లో విడుదల అవ్వాల్సిన సాయి ధారమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా కరోనా వల్ల విడుదల అవ్వలేదు.అదే రీతిగా అసలు పలు సినిమాలు కూడా విడుదల అవ్వకుండా ఆగిపోయాయి. కోరోన ఆంక్షలు సడలించిన కొలది ఒక్కో సినిమా థియేటర్ లో లేదా ఓ టీ టీ లో దర్శనమిస్తున్నాయి.
తాజాగా సాయి ధరమ్ తేజ్ దేవా కట్ట కాంబినేషన్ లో నిర్మించబడ్డ రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న రిలీజ్ కానుండగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతుండంగ ప్రస్తుతం బారి అభిమానులతో ఆంధ్ర రాజకీయంగా దూసుకెళ్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మూవీ ప్రమోషన్ కొరకు వచ్చి ఈవెంట్ లో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచి ఇచ్చిన స్పీచ్ పొలిటికల్ గా హీట్ పెంచింది.

రిపబ్లిక్ సినిమా ట్రెయిలర్ ద్వారా 40 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ ట్రెయిలర్ లో ప్రేక్షకులను మెప్పించే డైలాగ్స్ తో సినిమాలోనీ స్టోరీ లైన్ కొద్దిగా అర్దం అయ్యేలా రివిల్ చేస్తూ ప్రజలను సినిమా వైపు ఆకట్టుకుంది ఈ ట్రైలర్ చూసిన వారంతా గొప్పగా పొగిడేస్తున్నారు. కచ్చితంగా ఇది సూపర్ హిట్ కాబోతుందని అంటున్నారు.
వరుసగ 3 హిట్లు సొంతం చేసుకున్న సాయి ధారమ్ తేజ్ ఈ సినిమాలో కూడా అదరగొట్టే స్టొరీ తో మరో హిట్ సాదించబోతున్నాడని ప్రజలు ఫిక్స్ అయిపోయారు.ఇక ఈ సినిమా రాజకీయాలను ఉద్దేశించి తెస్తున్న సినిమా గా ట్రైలర్ ద్వార తెలిసి పోయింది అయితే ఈ సినిమాలో చూపించే రాజకీయం ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించినట్టు అర్ధం అవుతుంది. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో రాజకీయ నాయకురాలుగా కనబడుతుండగా సాయి ధారమ్ తేజ్ కలెక్టర్ గా కనిపించనున్నారు.
జగపతి బాబు గారు కూడా ఒక ముక్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వేరు వేరు కథలతో మల్టీ స్టోరీ లైన్ కలిగి ఉండటం హైలైట్ . రాజకీయల ద్వారా అదుపు తప్పిన ఉద్దేశ పరిస్థితులు అనే బేస్ లైన్ పైన ఈ చిత్రం తెర కెక్కబోతుంది . రాజకీయం అనే వ్యవస్థ దేశాన్ని నడుపుతున్న రాజకీయ , న్యాయ, మీడియా అధికారిక వ్యవస్థలను శాసిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంత పాలన వస్తుంది అనే అంశం పైన ఈ సినిమా మనముందుకు రాబోతుంది. ఈ సమస్యపై పోరాడే కలెక్టర్ గా సాయిధరమ్ తేజ్ తన నటనతో అదరగొట్టబోతున్నాడు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నారు.అక్టోబర్ 1న ఈ చిత్రం జేబీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రపంచమంతా కూడా రిలీజ్ కాబోతోంది.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అంశం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం సినీ ఛాంబర్ లో జరుగుతున్న మా ఎలక్షన్స్ అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. సినీ పరిశ్రమ వైపు చూడవద్దు మేము ఊరుకోము అంటూ ఘాటుగా డైలాగులు వేస్తూ ప్రారంభించిన ప్రవన్ కళ్యాణ్.
సినీ పెద్దలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వద్ద డబ్బులు లేవు అందుకే సినిమా టిక్కెట్లు అడుగుతున్నారు ఆ రకంగా వారు సంపాదించిన డబ్బును ప్రభుత్వ బ్యాంకు ఖాతాలో చూపించి బ్యాంకులో లోన్లు తీసుకోవచ్చు అనే కోణంలో ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని. ప్రైవేట్ వ్యక్తులు తమ కష్టార్జితంతో తీసే సినిమాల పైన గవర్నమెంట్ పెత్తనము ఉండకూడదని సినిమా పెద్దలను విజ్ఞప్తి చేస్తూ ఈ చర్యను వ్యతిరేకించండి అని కోరాడు.
ఇంకా డోస్ పెంచి మోహన్ బాబు గారిని గురించి ప్రస్తావించాడు. మీరు నడిపే కాలేజీ సీట్లు ఆన్లైన్ చేస్తాను అంటే మీరు ఒప్పుకుంటారా సినిమా టిక్కెట్లు ప్రైవేటు పరం చేస్తా అంటే ఎలా ఒప్పుకున్నారని మోహన్ బాబు పై సెటైర్లు వేశారు. అలాగే సినిమా పరిశ్రమ చూడ్డానికి చిన్నదిగానే కనిపిస్తుంది కానీ అది తీసుకునే నిర్ణయాలు గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి.కాబట్టి సినిమా పరిశ్రమ జోలికి రావద్దు అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.