ariyana

అరియానా కోసం… జిమ్ ట్రైనర్ గా అవతారం ఎత్తిన వర్మ

Movie News

రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అది సంచలనం అవుతుంది అని మరోసారి ప్రూవ్ అయ్యింది.ఇతర దర్శకులకన్న ఎంతో ప్రత్యేకంగ ఉండే వర్మ,తెలుగు దర్శకులలోనే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు.మూవీస్ లో గాని,సోషల్ మీడియాలో గాని చివరికి రాజకీయ విమర్శలలో గాని తనదైన శైలిలో స్పందించడం మనందరికీ తెలియని విషయం ఏమి కాదు.

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచనాలకు మారు పేరు గా చెప్పుకుంటారు.ఎవరు ఎటువంటి సెటైర్లు వేసిన నవ్వుకుంటు”అయితే నాకేంటి?” అనే తగ్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం ఎవరైనా వర్మ దగ్గరి నుండే నేర్చుకోవాలి.ఇతర దర్శకులతో పోల్చుకుంటే రామ్ గోపాల్ వర్మకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

టాలీవుడ్ లో ఏ దర్శకుడు కూడా వర్మ లగా సోషల్ మీడియాలో అంత ఆక్టివ్ గా కనిపించడు. అంతే కాదు అతను చేసే ట్వీట్స్ కూడా అప్పటికప్పుడే సెన్సేషన్ గా మారుతుంటాయి.అలాంటి ఒక గుర్తింపును వర్మ సోషల్ మీడియాలో సృష్టించుకున్నాడు.వర్మ చేసే ట్వీట్లు అల్ ఇండియా లెవెల్ లో చర్చనీయాంశాలుగా ఉంటాయి.

ariyana rgv

మూవీస్ ద్వారా ఫేమస్ అయిన డైరెక్టయిర్స్ ఉన్నారు,ట్వీట్ల ద్వారా ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు కానీ మన వర్మ అటు ఎవరు ఎప్పుడు తీయడానికి ధైర్యం చేయని సినిమాలు తీస్తూ అదే సమయం లో ప్రత్యేకమైన సెటైర్స్ తో కూడిన పోస్టు లతో అందరు తన గురించి మాట్లాడుకునే లాగా చేసుకోవడం, ప్రజలని ఆకర్షించడం వర్మ కు వెన్నతో పెట్టిన విద్యా అని ఒప్పుకోవాల్సిందే.
అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వర్మ – అరియానా పోస్ట్ వైరల్ గా మారింది.ఈ పోస్టు కి నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ పెడుతూ,సెటైర్లు వేస్తున్నారు.

ఆ పోస్టు ను వర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసి “ఈ బిగ్ బాస్ లిటిల్ బ్యూటీ అరియాన గ్లోరి జిమ్ లో కి కూడా వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తుంది” అని పోస్ట్ చేసాడు.దాంతో పాటుగా వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అందులో అరియానా స్పోర్ట్స్ బ్రా లో ఉండగా ఆమె వెనకాల నుండి రామ్ గోపాల్ వర్మ డంబుల్స్ పట్టుకుని జిమ్ ట్రైనర్ గా కనిపించాడు.

ఈ బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఎవరో ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు.ఆమె బిగ్ బాస్ లోకి రాక ముందే యూట్యూబ్ లో చాలా ఫేమస్.అంతే కాదు ఒక ఇంటర్వ్యూ లో వర్మ “నిన్ను బికినిలో చూడాలనుంది” అంటూ ఆయన చేసిన కామెంట్ తో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ariyana rgv

అయితే ఈ పోస్ట్ పైన రకరకాల చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.అయితే ఈ ఇంటర్వ్యూ సరదాగా జరిగిందో లేక వర్మ గతంలో చెప్పినట్లు అరియానాకు సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిసారి ప్రతీ సినిమాలో ఎవరో ఒక కొత్త నటులను పరిచయం చేసే దర్శకులలో ఎప్పుడు ముందుండే వర్మ,భవిష్యత్తులో రాబోయే మూవీస్ లో అరియానాను చూపించే అవకాశాలు చాల వరకే ఉన్నాయి.అయితే యూట్యూబ్ లో నటించినంత సులువుగా మూవీస్ లో నటించడం కాదని అనుకుందో ఏంటో మరి వర్మ దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఉందని చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో వర్మ – అరియానా లకు మాత్రమే తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *