కొంతమంది సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం కోసం అప్పుడప్పుడు రైతులుగా మారుతుంటారు, అలా మారిన కొంతమంది టాలీవుడ్ సెలెబ్రెటీలను ఇప్పటికే మనం చూసాం. క్రికెట్ ఆటగాడు కెప్టెన్ కూల్ ఎం.ఎస్.ధోని,టాలీవుడ్ లో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరియు ప్రకాష్ రాజ్ వంటి వారు వ్యవసాయం చేసిన సంగతి ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే. అయితే ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్ అనే ఈ భయంకరమైన మహమ్మారి కారణంగా కూడా ఇప్పుడు ఓ నటుడు రైతుగా అవతారమెత్తాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ కు చెందిన ఆశిష్ శర్మ అనే నటుడు కరోన కారణంగా ముంబై బిజీ లైఫ్ కు గుడ్ బై చెప్పి చాలా దూరంగా వెళ్లి ఓ పల్లెటూరి లో రైతుగా తనని మార్చుకొని ప్రసాంతకరమైన జీవం శైలిని ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
‘సియా కే రామ్’ సీరియల్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటుడు అందరికీ బాగా తెలిసిన ముఖం.ఈ నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశించాలనే ప్రయత్నించాడు కానీ కుదర్లేదు.
‘మోదీ: జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్’ అనే ఒక వెబ్ సిరీస్ లో అతను మోదీ పాత్రని పోషించి భారత దేశం మొత్తంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముంబైకి పట్టణానికి చాలా దూరంగా రాజస్థాన్ రాష్ట్రం చేరుకుని,ఓ సాధారణ రైతుగా గెటప్ మార్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు.
ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ప్రజలు ఎక్కువగా వారి బిజీ లైఫ్ కారణంగా లైఫ్ అందించే చిన్న చిన్న ఆనందలను ఆస్వాదించలేకపోతున్నారు.ఆ దిశగా ఎవరు కూడా చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే ఈ కరోనా కారణంగా ఈ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో నేను తెలుసుకున్నాను.
View this post on Instagram
ఇన్ని సంవత్సరాలకు నాకు ఈ ప్రకృతి విలువ మరియు అందులో ఉండే మాధుర్యం అర్ధం చేసుకోగలిగాను. మా తాత ముత్తాతలు అందరు కూడా వ్యవసాయం చేసేవారు.అయితే ముంబై పట్టణానికి రావడం వలన నేను మా వ్యవసాయానికి మరియు పొలానికి దూరమయ్యాను.అయితే మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో నాకు మా ఊరు ఎంతగానో గుర్తొచ్చింది.
ఈ ఊళ్లో 40 ఎకరాల వ్యవసాయ భూమి మాకు ఉంది. అంతే కాకుండా 40 ఆవులు కూడా మేము సంపాదించుకోగలిగాము.అయితే ఇంత భూమి ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ వ్యవసాయం చేసి ప్రజలకు ఇంకెక్కువ అన్నం పెట్టగలమనిపించింది. ఇందులో ఎంతో సంతోషం కూడా ఆస్వాదించగలుగుతున్నాను” అంటూ నటుడు చెప్పుకొచ్చాడు.