గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ వరసగా స్పీచ్ లతో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉన్నాడు. తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పైన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పూర్తి సిని ఇండస్ట్రీ వారికి సూచనలిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు .
ఏ విషయాన్ని తమ పరువుగా భావించిన కొంతమంది మంత్రులు పండిస్తూ పవన్ కళ్యాణ్ కి రివర్స్ కౌంటర్ వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒక రేంజ్ లో సంచలనంగా మారాయి. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు ఏదో ఒక మాధ్యమం ద్వారా పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ మంత్రుల మధ్యలో పోటాపోటీగా మాటల యుద్ధం జరుగుతోంది.
ఇదే విషయంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తూ గతంలో ఉన్నట్టుగా ప్రస్తుత సినిమా కలెక్షన్లు లేవని గతంలో సామాన్యుని దృష్టిలో పెట్టుకొని సినిమా టిక్కేట్ రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండేవని కానీ తాజాగా తాము పెట్టిన పెట్టుబడులు త్వరగా రాబట్టుకోవడానికి సినిమా టిక్కెట్ రేట్లు అమాంతంగా పెంచేశారు అని వ్యాఖ్యానించారు.
గతంలో ఎన్టీఆర్ సినిమా అయినా రాజబాబు సినిమా అయినా టికెట్ రేట్ల లో మార్పు ఉండేది కాదని ఆ రోజుల్లో సినిమా బాగుంటేనే 100 రోజులు ఆడి భారీ కలెక్షన్లు సంపాదించేది అని ఈ కాలంలో సినిమాలు వంద రోజులు ఆడుతాయి అన్న ప్రస్తావనే లేదు అని అన్నారు.

ప్రస్తుతం టికెట్ ధరను 500 ఓపెన్ చేసి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మొదటి వారంలోనే రాబట్టేల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ అనేట్వంటీ ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక గుదిబండలాగా మోహరించడం పవన్ కళ్యాణ్ ని విమర్శించారు.
ఇదే సమయంలో బాహుబలి కలెక్షన్ల ప్రస్తావన తీసి బాహుబలి ఈ సినిమా విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు సరిగా అందడం లేదని అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కూడా అందాల్సిన మొత్తం అందలేదని అందుకొరకే ప్రభుత్వము ఆన్లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్ముతుందని.
తద్వారా సినిమా కలెక్షన్లు మరియు పెట్టుబడుల విషయంలో తాము నిర్వహించబోయే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రతి విషయాన్ని గవర్నమెంట్ స్వీకరించి అందరికీ న్యాయం జరిగే రీతిగా చర్యలు తీసుకుంటోందని పెద్దవాడు పేదవాడు అని తేడా లేకుండా ప్రతి వాడు సినిమాలు చూసే సౌలభ్యం ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఇలాంటి ఒక మంచి పని పవన్ కళ్యాణ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని పవన్ కళ్యాణ్ ని విమర్శించారు.
ఇలా టిక్కెట్లు అమ్ముకొని ప్రభుత్వ ఖజానా నింపుకుని వాటిని బ్యాంకులకు చూపిస్తూ బ్యాంక్ ల నుండి అప్పులు తీసుకుంటోంది ఈ ప్రభుత్వం అన్న పవన్ కళ్యాణ్ వాదనను ఎత్తి ప్రభుత్వము ఒకవేళ రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సంపాదిస్తే వాటితో ఎంత లోన్ తీసుకోవచ్చు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు సూచిస్తే బాగుంటుందని సజ్జల వ్యాఖ్యానించారు
ఇదే సమయంలో బాహుబలి సినిమా కలెక్షన్లపై సజ్జల విరుచుకుపడుతూ. సినిమా విడుదల అయిన మొదటి వారంలో ప్రభుత్వానికి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు చెల్లించాల్సి ఉండగా సినిమా థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్టు చూపించి వాళ్ళు కట్టాల్సిన డబ్బులు ఎగొట్టారు. ఈ లెక్కన ఎన్ని సినిమాలు ఈ రీతిగా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును ఎక్కడున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని అంటూ అందుకొరకే ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు అనే ప్రక్రియను ప్రతిపాదించిందని వెల్లడించారు