నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఆదిత్య 369 ఒక మైల్స్టోన్ చిత్రం.ఆ సినిమా తర్వాత బాలకృష్ణకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా ఆయన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.ఆ చిత్రంలో ఆయన నటనకు ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశం పొందుకున్నారు.ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీలో వస్తే చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు మిస్ అవ్వకుండా చూస్తుంటారు.
అంతలా ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చింది.ఆ సినిమాతో తెలుగు ప్రయక్షకులు కేవలం ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు అని అర్ధం అయ్యింది. అయితే టైం మిషన్ నేపథ్యంలో ఓ సైన్స్ ఫిక్షన్ కామెడీ యాక్షన్ డ్రామాగా 1991లో రిలీస్ అయిన ఈ చిత్రం అప్పట్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ మూవీలో రాజనర్తకి పాత్రలో సిల్క్ స్మిత తన గ్లామరస్ నటనతో పైక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి వరకూ ఆమె కేవలం ఐటమ్స్ సాంగ్స్ మరియు కొన్ని గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ తొలిసారిగా సిల్క్ స్మిత ఈ చిత్రంలో ఓ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ అప్పటి మూవీ విశేషాలను గుర్తు చేశారు. సిల్క్ స్మిత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
‘సిల్క్ స్మిత తమిళనాడులోనే పుట్టి పెరిగింది.ఆమెకు తెలుగు అసలు అర్ధం అయ్యేది కాదు. తర్వాత మెల్లి మెల్లిగా మాట్లాడడం నేర్చుకుంది కానీ, తెలుగులో అంత డెప్త్ గా వెళ్ళలేదు. ఒక మూవీలో ఆమెకు ఓ పెద్ద డైలాగు ఇచ్చారు. ఈ నీఛ నికృష్టుడు అనే డైలాగ్ ఆమె చెప్పాలి.అయితే స్మిత ఆ డైలాగ్ ను తెలుగులో మొదలుపెట్టి ఇంగ్లీష్‌లో ముగించింది. ఆవేశంగా డైరెక్టర్ని డైలాగ్ ఓకే నా సర్ అని అడిగే సరికి అందరూ షాక్ అయ్యారు. ‘నువ్ మాట్లాడింది తెలుగు కాదు తల్లి అది ఇంగ్లీష్..’ అని ఆ డైరెక్టర్ అనేసరికి సెట్లో అంత పగలబడి నవ్వుకున్నాం.
సిల్క్ స్మిత అంటే అంతకుముందు వరకు ఐటమ్ సాంగ్స్ గర్ల్.కానీ ఆదిత్య 369 మూవీలో స్మితకి ఫుల్ లెంగ్త్ పాత్ర లభించింది.లభించడం మాత్రమే కాదు ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలిగేది అన్నంతగా ఆమె ఆ పాత్రలో లీనమైపోయి చేసింది. సిల్క్ స్మిత ముఖంలో ఒరిజినల్ టాన్ ఉంటుంది. మేకప్స్ మరియు క్యాస్ట్యూమ్స్‌లో ఆమెను కొట్టే ఆడదే లేదు.
అయితే ఇక్కడ ఆడది అని నేను ఎందుకు సంబోధించాను అంటే, పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లే ఆమెను ఫాలో అయ్యేవారు. అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూడా స్మితని ఇమిటేట్ చేసేది. సిల్క్ స్మిత ఏ మేకప్ వేసుకుంటారు??
ఆమె ఏ బట్టలు దరిస్తారు అని చూసేవారు. ఒక మాములు ఐటమ్ సాంగ్స్ డాన్సర్‌ని స్టార్ హీరోయిన్లు సహితం ఫాలో అయ్యేవారు అంటే అది చిన్న విషయం కాదు’ అంటూ సిల్క్ స్మితపై ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు బాలకృష్ణ.