బాలసుబ్రమణ్యం ఆస్తులు అమ్మకానికి.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో క్లారిటీ ఇచ్చిన అతని కుమారుడు ఎస్.పి చరణ్..

News Trending

ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి తలియని వ్యక్తి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండడు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతను ఒక పాటకు తన స్వరాన్ని అందించాడు అంటే ఆ పాట ఆ సినిమా విజయంలో తప్పకుండ కీలక పాత్రను పోషిస్తుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు కేవలం ఆయన పాడిన పాటల కారణంగానే విజయాన్ని అందుకున్నాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు. గతం లో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు బాలసుబ్రమణ్యం గారు.

నిజానికి ఆ రోజుల్లో అతని పాటల కోసమే సినిమా థియేటర్లకు వెళ్లేవారు అంటే చిన్న విషయం కాదు. అంతటి అద్భుతమైన గాత్రం కేవలం బాలసుబ్రమణ్యం గారికే సొంతం. అయితే ఏది ఏమైనప్పటికి ఇలాంటి వారి గురించి కూడా గతం లో చాలా కాంట్రవర్సి తో కూడిన వార్తలు వచ్చాయి.అయితే బాలసుబ్రమణ్యం ఆస్తులు అమ్ముకొని అతని కుమారుడు చరణ్ తన అప్పులను కడుతున్నాడు అనే వార్తలు చాలానే వచ్చాయి.

బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ నిర్మాతగా చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి అప్పులు తీర్చలేక బాలసుబ్రమణ్యం తన ఆస్తులు అమ్ముకున్నాడని చాలానే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా చరణ్ ఈ వార్తల పై ఒక క్లారిటీ ఇచ్చారు.

‘ నేను నాన్నగారి ఆస్తులను అమ్మేసాను అని వస్తున్న వార్తల్లో ఎత్తువంటి నిజం లేదు.నేను నిర్మాతగా అనేక సినిమాలు తీసాను అనేది వాస్తవం మరియు నేను తీసిన ఈ చిత్రం కూడా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. కానీ నేను వాటివల్ల వచ్చిన నష్టాలను మా నాన్న గారి ఆస్తులను అమ్మి భర్తీ చేశాను అనడం చాలా తప్పు.నేను నా అప్పులను భర్తీ చేయడానికి వేరే మార్గాలను చూసుకున్నాను , కానీ నేను ఎప్పుడు కూడా మా నాన్న గారి ఆస్తులను అమ్మలేదు.

అయితే నాన్న గారు స్థాపించిన కోదండపాణి స్టూడియోని అమ్మేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ సొంత స్టూడియోలను ప్రారంభించారు.దాని కారణంగా మా స్టూడియోలో పని తగ్గిపోయింది. మా స్టూడియోలో రికార్డింగ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి అందులో పని చేసేవారికి కూడా మేమే వేరే పని చూసి. స్టూడియోను మూసేసం, అంతే కానీ మా అప్పులు తీర్చుకోడానికి కాదని’ చరణ్ స్పష్టం చేశారు.

ఇలా బాలసుబ్రమణ్యం ఆస్తులు అమ్మి చరణ్ తన అప్పులు తీర్చుకుంటున్నాడు అనే అపోహలకు క్లియర్ కట్ గా సమాధానం చెప్పేసారు చరణ్.అయితే ఎంతో కాలంగా బాలసుబ్రమణ్యం గారు నడిపించిన పాడుతా తీయగా అనే షోను తాను సొంతం చేసుకోబోతున్నాని చెప్పారు చరణ్. బాలసుబ్రమణ్యం ఈ షోను తన అనుభవంతో ఎంతో చక్కగా నడిపించారు అయితే ఆలా చరణ్ నడిపించగలుగుతాడా అనేది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *