భారత రత్నఅవార్డు నాన్న చెప్పుతో సమానం .! దేశ అత్యున్నత పురస్కారం పై బాలక్రిష్ణ

News

బాల‌కృష్ణ గారు ఎక్కువగా ఈ మధ్య ఇంట‌ర్వ్యూల‌లో చేసే వ్యాఖ్యలు ఎంత వివాద‌స్ప‌దం అవుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. వాటి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలక్రిష్ణ నటించిన అతని అల్ టైం క్లాసిక్ సినిమా అయినా ఆదిత్య 369 మూవీ ఇటీవలే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయన ఓ మీడియా ఛానెల్‌ జరిపిన ఇంట‌ర్వ్యూ లో ఎన్నో విషయాలు పంచుకున్నాడు.అయితే ఆ ఇంటర్వ్యూలో మూవీకు సంబంధించిన ఎన్నో మ‌ధురానుభూతులు గుర్తుకు చేసుకుంటూనే మ‌ధ్య‌మ‌ధ్య‌లోషాకింగ్ కామెంట్స్ చేశారు.

‘ఏఆర్ రెహమాన్ అంటే ఎవరో నాకు తెలియదు. నేను అసలు పట్టించుకోను. అతను పదేళ్లకు ఓ హిట్ ఇస్తాడు.ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంటే ఏంటి..?ఇలాంటి అవార్డులు అన్నా ‘భారతరత్న’ అయిన కూడా రామారావు చెప్పుతో సమానం.చివరికి మా నాన్న కాలి గోటితో కూడా సమానం అనను. ఒకవేళ అవి ఇచ్చిన కూడా ఇచ్చినోళ్లకు గౌరవం కానీ, ఆయనకు గౌరవం ఏంటి?

పదవులకు ఆయన అలంకారం అవుతారు కానీ,ఆయనకు పదవులు అలంకారం ఎప్పటికి కావు అని అంటూ వీరావేశంగా మాట్లాడారు.

సిల్క్ స్మిత గురించి బాలకృష్ణ మాట్లాడుతూ,ఆదిత్య 369 సినిమాకు రిలీస్ అవ్వకముందు వరకు సిల్క్ స్మితకు ఉన్న గుర్తింపు చాలా తక్కువ. ఈ చిత్రం తోనే ఆమె నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సిల్క్ స్మిత ఒక మాములు డ్యాన్సరే కావొచ్చు అయినప్పటికీ ఆమె వేసుకొనే క్యాస్టూమ్స్ మరియు మేకప్ల గురించి అప్పటి స్టార్ హీరోయిన్లు కూడా ఆరా తీసేవారు అంటే నమ్ముతారా. శ్రీదేవి లాంటి గొప్ప నటీమణులు కూడా సిల్క్ స్మిత వేసుకునే మేకప్స్ మరియు డ్రెస్సింగ్ స్టయిల్ ను అనుకరించే వాళ్లు అని బాలకృష్ణ చెప్పారు.

వారికి వారే గొప్ప డ్యాన్సర్లు గా భావించే శ్రీదేవి మరియు మాధురీ దీక్షిత్ వారి కొరియోగ్రాఫ‌ర్స్ ని తొలగించేశారు. కొరియోగ్రాఫర్ అయిన సరోజ్ ఖాన్ సిల్క్ స్మిత డాన్స్ స్టెప్పులను కాపీ కొట్టి సినిమా లల్లో మక్కీకి మక్కీ దించేశారు. శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా నాన్నగారే (స్వర్గీయ రామారావు) వాళ్ళ కాళ్లు తొక్కుతూ డ్యాన్స్ మరియు యాక్టింగ్ నేర్పించారు. వారు వీపులపై గుద్ది, నడుముపై గిల్లి మా నాన్నగారు అన్ని నేర్పించారు. వాళ్లు చాలా నాజుకుగా ఉంటూ డాన్స్ చేసేవారు. కానీ నాన్న గారు అలా కాదు చాలా రఫ్ కదా అందుకోసమే వాళ్ల కాళ్లు తొక్కి మరి దగ్గరుండి వారికి డ్యాన్స్ నేర్పించారు అని బాలకృష్ణ చెప్పారు.

పేరు ప్రఖ్యాతల కోసం తాను ఎప్పుడూ పాకులాడను అంటూనే ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రజలు దేశ అత్యున్న‌త పుర‌స్కారం అయిన భార‌ర‌త్న‌ను కించ‌పరుస్తూ మాట్లాడడం తప్పు పడుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరియు అంతే కాకుండా ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ల పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా చాలా పెద్ద త‌ప్పు అంటూ నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. బాలయ్య తన వైఖరి మార్చుకోవాలంటూ లేకపోతే బాగుండదంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే మరీ ఈ వివాదం పై బాలక్రిష్ణ గారు ఇప్పటికైనా ఏమైన క్లారిటీ ఇస్తాడా.? వేచి చూడాలి.

ఇదిలా ఉండగా ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘ఆదిత్య 999 మాక్స్’ మూవీ చేయనున్న బాలక్రిష్ణ ,సీక్వెల్ పనులు ఇదివరకే మొదలై శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.అంతే కాకుండా ఈ సినిమా ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టబోతున్నాడని మరోసారి గుర్తు చేశారు.అయితే ఈ ‘ఆదిత్య 999 మాక్స్’ అనే చిత్రాన్ని 2023లో మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పటివరకు అభిమానులు వేచి ఉండాల్సిందే అని బాలకృష్ణ అన్నారు. అఖండ త‌ర్వాత బాలక్రిష్ణ గారు గోపిచంద్ మ‌లినేని, అనీల్ రావిపూడి, పూరీ జ‌గ‌న్నాథ్ వంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేయ‌నున్నారు నందమూరి నట సింహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *